OTT Crime Thriller: ఆరేళ్ల తర్వాత తెలుగులోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పడంటే..-mammootty malayalam crime thiller movie coming in telugu as derick abraham on aha ott release date malayalam films ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఆరేళ్ల తర్వాత తెలుగులోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పడంటే..

OTT Crime Thriller: ఆరేళ్ల తర్వాత తెలుగులోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 07, 2024 11:28 PM IST

Derick Abraham OTT: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహామింతే సంతాతికల్ చిత్రం ఆరేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వస్తోంది. డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులోకి ఓటీటీలో రానుంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

OTT Crime Thriller: ఆరేళ్ల తర్వాత తెలుగులోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పడంటే..
OTT Crime Thriller: ఆరేళ్ల తర్వాత తెలుగులోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పడంటే..

కొన్నేళ్ల క్రితమే థియేటర్లలో రిలీజైన కొన్ని మలయాళం సినిమాలు తెలుగు డబ్బింగ్‍తో ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇటీవల బాగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అబ్రహామింతే సంతాతికల్ తెలుగు డబ్బింగ్‍లోకి వచ్చేస్తోంది. డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులో అందుబాటులోకి వస్తోంది. మలయాళంలో రిలీజైన ఆరేళ్లకు తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. డెరిక్ అబ్రహాం సినిమా తెలుగులో ఏ ఓటీటీలోకి ఎప్పుడు రానుందో ఇక్కడ తెలుసుకోండి.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

డెరిక్ అబ్రహాం సినిమా ఆగస్టు 10వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా మలయాళంలో 2018 జూన్‍లో రిలీజైంది. ఇప్పుడు సుమారు ఆరేళ్ల తర్వాత తెలుగులో డబ్బింగ్ అయింది. ఆగస్టు 10వ తేదీ నుంచి ఆహాలో డెరిక్ అబ్రహాం తెలుగు మూవీని చూడొచ్చు.

డెరిక్ అబ్రహాం సినిమాకు షాజీ పాడూర్ దర్శకత్వం వహించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్ తమ్ముడే మర్డర్ కేసులో అనుమానితుడిగా ఉండడం, ఆ తర్వాత ట్విస్టులతో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ఏఎస్‍‍పీ డెరిక్ అబ్రహాంగా మమ్ముట్టి మెయిన్ రోల్ చేశారు. అన్సోన్ పౌల్, కనిక, తరుషి ఝా, రెంజీ పనికర్, యోగ్ జపీ, కళాభవన్ షాజోన్, సురేశ్ కృష్ణ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.

ఈ మూవీ మలయాళంలో 2018 జూన్ 16వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అప్పట్లోనే సుమారు రూ.40కోట్ల కలెక్షన్లతో భారీ హిట్ అయింది. సుమారు రూ.6కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఆ రేంజ్ వసూళ్లతో బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత తెలుగులో డెరిక్ అబ్రహాం పేరుతో ఆహాలోకి వస్తోంది.

డెరిక్ అబ్రహాం చిత్రాన్ని గుడ్‍విల్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై టీఎల్ జార్జ్, జాబీ జార్జ్ నిర్మించారు. గోపీసుందర్, సెరిన్ ఫ్రాన్సిస్ సంగీతం అందించారు. అల్బీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మహేశ్ నారాయణ్ ఎడిటింగ్ చేశారు.

స్టోరీలైన్

వరుసగా జరిగిన తొమ్మిది హత్యల కేసును ఏఎస్‍పీ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) విచారణ జరుపుతారు. పదో మర్డర్ చేయకముందే ఈ దారుణాలకు పాల్పడిన సైమన్‍ను డెరిక్ అరెస్ట్ చేస్తారు. అయితే, గొంతు కట్ అయిపోయి అనుమానాస్పద స్థితిలో కస్టడీలోనే చనిపోచాడు సైమన్. అది ఆత్మహత్య అని డెరిక్ భావిస్తాడు. ఈ విషయంలో సస్పెండ్ అయ్యాక మళ్లీ విధుల్లో చేరతాడు. అయితే, గర్ల్ ఫ్రెండ్ అలీనాను చంపిన కేసులో డెరిక్ సోదరుడు ఫిలిప్ అబ్రహాం (అన్సోల్ పౌల్) అరెస్ట్ అవుతాడు. ఆధారాలు వ్యతిరేకంగా ఉండటంతో ఫిలిప్‍పై కేసు బలపడుతుంది. అయితే, ఫిలిప్‍పై పెట్టింది తప్పుడు కేసుగా ఉంటుంది. మరి నిజాన్ని నిరూపించి తమ్ముడిని కేసు నుంచి డెరిక్ అబ్రహాం బయటికి తీసుకొచ్చాడా? అంతకు ముందు జరిగిన హత్యల మిస్టరీని ఛేదించాడా? అనే విషయాలు డెరిక్ అబ్రహాం మూవీలో ప్రధానంగా ఉంటాయి.