Rebel OTT: ఓటీటీలో రిలీజైన ప్రేమలు హీరోయిన్ మమితాబైజు లేటెస్ట్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Rebel Movie: ప్రేమలు ఫేమ్ మమితా బైజు రెబెల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెబెల్ మూవీ థియేటర్లలో రిలీజైన పది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
Rebel OTT: ప్రేమలు మూవీతో ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది మమితా బైజు. ఈ క్యూట్ లవ్‌స్టోరీలో రీనూ రాయ్ పాత్రలో తన అందం, నటనతో యువతరం కలల రాణిగా మారిపోయింది. మమితా బైజు సౌత్‌లో మరో సాయిపల్లవి అవుతుందంటూ పలువురు సినీ ప్రముఖులు ఈ ముద్దుగుమ్మపై ప్రశంసలు కురిపించారు. ప్రేమలు తర్వాత మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో మమితా బైజుకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి.
రెబెల్‌తో కోలీవుడ్ ఎంట్రీ...
ప్రేమలు మమితా బైజు హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ రెబెల్ మార్చి 22న థియేటర్లలో రిలీజైంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన రెబెల్ మూవీతోనే మమితా బైజు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ పది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రెబెల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజై కనీసం రెండు వారాలు కూడా కాకముందే రెబ్‌లో ఓటీటీలో విడుదల కావడం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
యథార్ఠ ఘటనల ఆధారంగా...
రెబెల్ మూవీకి నికేష్ ఆర్ ఎస్ దర్శకత్వం వహించారు. కేరళలోని మున్నార్‌కు చెందిన ఓ స్టూడెంట్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. రెబెల్ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో పాటు స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఫస్ట్ వీకెండ్‌లోనే థియేటర్ల నుంచి ఈ మూవీని ఎత్తేశారు.
రెబెల్ కథ ఇదే...
కథిరేసన్ ఓ మలయాళీ కుర్రాడు. ఉన్నత చదువుల కోసం మున్నార్ నుంచి పాలక్కాడ్ వస్తాడు. అక్కడ కొందరు తమిళ స్టూడెంట్స్‌తో జరిగిన గొడవ కథిరేసన్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది. కాలేజీ గొడవగా మొదలైన ఈ ఇష్యూ రాజకీయ రంగను ఎలా పులుముకుంది? సారా మేరీ జాన్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ కథిరేసన్ ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం ఎలాంటి పోరాటం చేశాడన్నదే రెబెల్ మూవీ కథ. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేజీ జ్ఞానవేళ్ రాజా రెబెల్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
డెబ్యూ మూవీనే షాక్...
ప్రేమలు మూవీతో మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న మమితా బైజుకు తమిళంలో మాత్రం తొలి డెబ్యూ మూవీనే షాకిచ్చింది. థియేటర్లలో కోటిలోపే వసూళ్లను రాబట్టి డిజాస్టర్స్ కా బాప్‌గా నిలిచింది.
తెలుగులోనూ హిట్...
ప్రేమలు సినిమాతో మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది మమితా బైజు. మలయాళంలో పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అగ్ర దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశాడు. టాలీవుడ్‌లోనూ పదిహేను కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి కార్తికేయకు లాభాలను మిగిల్చింది.
ప్రేమలు కంటే ముందుగా తమిళంలో రామచంద్ర బాస్ అండ్ కో, ప్రణయవిలాసం, ఖోఖో ఆపరేషన్ జావాతో మరికొన్ని మలయాళ సినిమాలు చేసింది మమితా బైజు.
ప్రేమకథా చిత్రమ్ రీమేక్‌తో...
మరోవైపు కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతోన్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా మాత్రం బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో డిసపాయింట్ చేస్తున్నాడు. తెలుగు హారర్ మూవీ ప్రేమకథా చిత్రమ్ ఆధారంగా వచ్చిన డార్లింగ్‌తో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జీవీ ప్రకాష్ కుమార్. తమిళంలో త్రిష ఇల్లానా నయనతార, పెన్సిల్, బ్రూస్‌లీ, 100 పర్సెంట్ కాదల్, అడియోతో పాటు చాలా సినిమాలు చేశాడు. అవేవీ అతడికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి.