Adhrushyam OTT: తెలుగులోకి వచ్చిన మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
Adhrushyam OTT: ఆకాశమే నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ అదృశ్యం ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Adhrushyam OTT: ఆకాశమే నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ అదృశ్యం ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో అదృశ్యం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో అపర్ణ బాలరమురళితో పాటు హరీష్ ఉత్తమన్, సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. సైలెంట్‌గా అదృశ్యం మూవీని ఈటీవీ ఓటీటీలో రిలీజ్ చేసింది.
మలయాళం డబ్బింగ్ మూవీ...
మలయాళం మూవీ ఇని ఉత్తరమ్‌కు డబ్బింగ్ వెర్షన్‌గా అదృశ్యం రిలీజైంది. 2022లో మలయాళంలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి అద్భుత నటనతో మెప్పించింది. అదృశ్యం మూవీకి సుదీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ ఖుషి ఫేమ్ షీషమ్ అబ్దుల్ వహాబ్...అదృశ్యం మూవీకి మ్యూజిక్ అందించాడు.
అదృశ్యం కథ ఇదే...
అశ్విన్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను ప్రాణంగా ప్రేమిస్తుంది జానకి. వీరిద్దరు పెళ్లిచేసుకోవాలని అనుకుంటారు. ఇంతలోనే తన ఫ్రెండ్‌ను హత్య చేశానంటూ జానకి పోలీస్ స్టేషన్‌కు వస్తుంది. నిజంగానే ఆమె హత్య చేసిందా? ఈ హత్య కేసులో ఆమెను ఎవరైన ఇరికించారా?
ఓ ఫ్యాక్టరీ కార్మికులు చేస్తోన్న స్ట్రైక్‌ను అన్యాయంగా హోమ్ మినిస్టర్ ఆపాలని ఎందుకు అనుకున్నాడు? జానకి హత్యకు హోమ్ మినిస్టర్ కుట్రలకు ఏమైనా సంబంధం ఉందా? జానకి మర్డర్ వెనకున్న మిస్టరీని ఎస్‌పితో కలిసి సీఐ ఎలా ఛేదించారు? అన్నదే ఈ మూవీ కథ.
సోషల్ మెసేజ్ విత్ క్రైమ్ ఎలిమెంట్స్...
సోషల్ మెసేజ్‌కు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు సుదీష్ రామచంద్రన్ ఈ మూవీని తెరకెక్కించాడు. కథలోని ట్విస్ట్, టర్న్‌లు ఆడియెన్స్‌ను అలరించాయి. తెలుగులో ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది. అపర్ణ బాలమురళి క్రేజ్‌తో మలయాళంలో ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.
నేషనల్ అవార్డు...
సూరరై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమాలో అసమాన యాక్టింగ్‌తో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకున్నది అపర్ణబాలమురళి. ధైర్యవంతురాలైన ఇల్లాలిగా ఆమె నటనకు తెలుగు, తమిళ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్‌కు దూరంగా ఉంటూ తమిళం, మలయాళ భాషల్లో ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువగా చేస్తోంది అపర్ణ బాలమురళి.
ధనుష్ రాయన్‌లో...
మలయాళంలో తాంకం, 2018, మయానది సినిమాలతో కమర్షియల్ విజయాల్ని అందుకున్నది. తమిళంలో నీథమ్ ఒరు వానమ్, సర్వం తాళమయంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న రాయన్‌లో డీ గ్లామర్ పాత్రలో అపర్ణ బాలమురళి నటిస్తోంది. మలయాళంలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. తమిళంలో ఫింగర్ ప్రింట్ సీజన్ 2 వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. సింగర్‌గా రాణిస్తోన్న అపర్ణ బాలమురళి మలయాళంలో పలు సినిమాల్లో పాటలు పాడింది. తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాల ద్వారానే చేరువైంది అపర్ణ బాలమురళి. తెలుగులో కొన్ని అవకాశాలు వచ్చిన కథలు నచ్చక వాటిని తిరస్కరించినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
టాపిక్