Malayalam survival thriller in telugu: మలయాళం సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది-malayalam survival thriller movie manjummel boys releasing in telugu next month malayalam movies news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Malayalam Survival Thriller Movie Manjummel Boys Releasing In Telugu Next Month Malayalam Movies News

Malayalam survival thriller in telugu: మలయాళం సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 01:52 PM IST

Malayalam movie in telugu: మలయాళంలో సూపర్ హిట్ అయిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఇప్పుడు తెలుగులోకీ వస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది.

తెలుగులోనూ రాబోతున్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్
తెలుగులోనూ రాబోతున్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్

Malayalam movie in telugu: సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.40 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమాను.. వచ్చే నెలలో తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మంజుమ్మెల్ బాయ్స్ రిలీజ్ డేట్

మలయాళం ఇండస్ట్రీలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. భ్రమయుగం, ప్రేమలు సినిమాలతోపాటు మంజుమ్మెల్ బాయ్స్ కూడా ఒకటి. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మంజుమ్మెల్ బాయ్స్ ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజైంది.

ఇప్పుడీ సినిమాను మార్చి 15న తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మూవీ రిలీజైనప్పటి నుంచీ కేరళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి ఎంతో ఉత్కంఠతో ఈ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను చూస్తున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటున్న ఈ మూవీని ఇతర భాషల ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు.

ఏంటీ మంజుమ్మెల్ బాయ్స్ స్టోరీ?

మంజుమ్మెల్ బాయ్స్ మూవీని ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించారు. 2006లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన ఓ స్నేహితుల బృందం తమిళనాడులోని కొడైకెనాల్ కు వెకేషన్ కోసం వెళ్తారు. అక్కడి గుణ గుహలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ గ్రూపులోని ఓ యువకుడు 60 అడుగుల లోతైన గుహలోకి పడిపోతాడు.

అతన్ని మిగిలిన స్నేహితులు ఎలా బయటకు తీసుకురాగలిగారన్నది ఈ మంజుమ్మెల్ బాయ్స్ మూవీ స్టోరీ. ఈ సినిమాలో సౌబిన్ భాసీ, గణపతి, దీపక్ పరంబోల్, లాల్ జూనియర్ లాంటి వాళ్లు నటించారు. మలయాళ ప్రేక్షకులకు సినిమా విపరీతంగా నచ్చేయడంతో తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది.

మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.5 రేటింగ్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. సినిమాను మార్చి నెలాఖరులో స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓటీటీలో అన్ని ఒకేసారి రెండు భాషల్లోనూ వస్తుందా లేక తెలుగు వెర్షన్ ఆలస్యం అవుతుందా అన్నది చూడాలి. సర్వైవల్ థ్రిల్లర్ కావడంతో సబ్ టైటిల్స్ తో అయినా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారనడంలో సందేహం లేదు.

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఫిబ్రవరిలోనే రిలీజైన భ్రమయుగం, ప్రేమలు సినిమాలు కూడా ఇప్పటికే బాక్సీఫీస్ దగ్గర విజయవంతం అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా మార్చిలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. మమ్ముట్టి నటించిన భ్రమయుగం ఓ హారర్ మూవీ కాగా.. ప్రేమలు ఓ రొమాంటిక్ కామెడీ మూవీ. మంజుమ్మెల్ బాయ్స్ పూర్తిగా ఓ డిఫరెంట్ జానర్. ఇలా మూడు జానర్ల సినిమాలు మలయాళం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం నిజంగా విశేషమే.

WhatsApp channel