Mahesh Babu Mathu Vadalara 2 Review: మత్తువదలరా 2 చిత్రానికి రివ్యూ ఇచ్చిన మహేశ్ బాబు.. అతడికి ప్రత్యేకంగా ప్రశంసలు-mahesh babu gave review to mathu vadalara 2 says its laugh riot and satya outstanding acting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Mathu Vadalara 2 Review: మత్తువదలరా 2 చిత్రానికి రివ్యూ ఇచ్చిన మహేశ్ బాబు.. అతడికి ప్రత్యేకంగా ప్రశంసలు

Mahesh Babu Mathu Vadalara 2 Review: మత్తువదలరా 2 చిత్రానికి రివ్యూ ఇచ్చిన మహేశ్ బాబు.. అతడికి ప్రత్యేకంగా ప్రశంసలు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 15, 2024 08:17 AM IST

Mahesh Babu Mathu Vadalara 2 Review: మత్తువదలరా 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు మరింత బలం వచ్చేసింది. ఈ మూవీకి సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ ఇచ్చారు. ప్రశంసలు కురిపించారు.

Mahesh Babu Mathu Vadalara 2 Review: మత్తువదలరా 2 చిత్రానికి రివ్యూ ఇచ్చిన మహేశ్ బాబు.. అతడికి ప్రత్యేకంగా ప్రశంసలు
Mahesh Babu Mathu Vadalara 2 Review: మత్తువదలరా 2 చిత్రానికి రివ్యూ ఇచ్చిన మహేశ్ బాబు.. అతడికి ప్రత్యేకంగా ప్రశంసలు

మంచి కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సపోర్ట్ ఇస్తున్నారు. కొన్ని చిత్రాలను చూసి సోషల్ మీడియాలో తన రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఆ సినిమాలకు బాగా ప్లస్ అవుతోంది. తాజాగా మత్తువదలరా 2 సినిమాపై మహేశ్ బాబు స్పందించారు. శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 13) థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ మూవీని చూసిన మహేశ్ బాబు రివ్యూను పోస్ట్ చేశారు.

నవ్వుల దాడి

మత్తువదలరా 2 సినిమా నవ్వుల దాడి చేసిందని, బాగా ఎంజాయ్ చేశానని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మొత్తంగా టీమ్‍కు అభినందనలు తెలిపారు. “మత్తువదలరా 2 ఓ నవ్వుల దాడి. నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను. శ్రీసింహతో పాటు మొత్తం నటీనటులు అద్భుతంగా చేశారు” అని మహేశ్ బాబు రాసుకొచ్చారు. కమెడియన్ సత్య గురించి ప్రశంసించారు.

సత్య.. అద్భుతంగా..

సత్య ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని మహేశ్ బాబు రాసుకొచ్చారు. “వెన్నెల కిశోర్ స్క్రీన్‍పై ఉన్నంతసేపు నా కూతురు న్వవు ఆపుకోలేకపోయారు. సత్య.. నువ్వు స్క్రీన్‍పై ఉన్నంతసేపు మేం నవ్వు అసలు ఆపుకోలేకపోయాం. అద్భుతమైన యాక్టింగ్. చాలా మంచి సమయం గడిపాం. మొత్తం టీమ్‍కు అభినందనలు” అని మహేశ్ ట్వీట్ చేశారు.

మత్తువదలరా 2 చిత్రం గురించి పోస్ట్ చేయటంతో మహేశ్ బాబుపై నెటిజన్లు మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి చిత్రాలను సపోర్ట్ చేసేందుకు మహేశ్ ఎప్పుడూ ముందుంటారని అంటున్నారు. కంటెంట్ ఉన్న చిత్రాలకు మద్దతుగా నిలుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళితో చేసే చిత్రంలో కమెడియన్ సత్యను కూడా తీసుకోవాలని కొందరు సూచించారు.

రాజమౌళితో మూవీ కోసం..

మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా కోసం జుట్టు, గడ్డం ఎక్కువగా పెంచేశారు మహేశ్. సరికొత్త లుక్‍తో అదరగొడుతున్నారు. ఈ చిత్రం కోసం కండలు కూడా భారీగా పెంచుతున్నారు. ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్స్ చేస్తున్నారు. మొత్తంగా రాజమౌళితో మూవీ కోసం తీవ్రంగా శ్రమిస్తూ సిద్ధమవుతున్నారు మహేశ్.

అయితే, మహేశ్ - రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందోననే ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్‍డేట్లు ఇవ్వలేదు రాజమౌళి. త్వరలోనే షూటింగ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మత్తువదలరా 2 మూవీ కోసం ఓ ప్రమోషనల్ వీడియోలో రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఎస్ఎస్‍ఎంబీ29 మూవీ అప్‍డేట్ ఇవ్వాలని అడిగితే శ్రీసింహను కర్రతో కొట్టేందుకు వచ్చారు. ఈ వీడియో సరదాగా సాగింది. రాజమౌళి అన్న, దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడే శ్రీసింహ.

2019లో వచ్చిన మత్తువదలరా చిత్రం సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్‍గా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మత్తువదలరా 2 వచ్చింది. ఈ చిత్రంలో శ్రీసింహ, సత్య, వెన్నెల కిశోర్‌తో పాటు ఫారియా అబ్దుల్లా, సునీల్, రోహిణి కీరోల్స్ చేశారు. ఈ సినిమాకు తొలి రోజే రూ.5.3కోట్ల కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ టాక్ బలంగా ఉండటంతో కలెక్షన్ల జోరు మరింత పెరగనుంది.