LR Eeshwari on Oo antava: ఊ అంటావా మావా పాట నేను పాడి ఉంటే మరో రేంజ్‌లో ఉండేది!
LR Eeshwari on Oo antava: ఊ అంటావా మావా పాట నేను పాడి ఉంటే మరో రేంజ్‌లో ఉండేదని అంటోంది సీనియర్ సింగర్ ఎల్ఆర్ ఈశ్వరి. అసలు అదో పాటేనా అని అనడం విశేషం.
LR Eeshwari on Oo antava: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ఈ సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాట ఓ ఊపు ఊపేసింది. అసలు ఐటెమ్ సాంగ్ అంటే ఇలా ఉండాలి అన్న రేంజ్ లో హిట్ అయింది. పైగా ఈ పాటకు సమంత స్టెప్పులు కూడా అదిరిపోయాయి.
ఆ పాట, మ్యూజిక్, లిరిక్స్, పాడిన విధానం, స్టెప్పులు.. ఇలా అన్నీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అయితే ఇదీ ఓ పాటేనా అంటూ సీనియర్ సింగర్ ఎల్ఆర్ ఈశ్వరి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసే ఈశ్వరి.. ఇప్పటికే తెలుగులో మసక మసక చీకటిలో, భలే భలే మగాడివోయ్ లాంటి పాటలతో కుర్రకారు మతిపోగొట్టింది.
అలాంటి సింగర్ ఓ టాప్ ఐటెమ్ సాంగ్ పై ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అసలు తనకు ఈ జనరేషన్ పాటలు నచ్చవని కూడా ఆమె అంటోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఊ అంటావా పాటపై స్పందించింది.
"అదొక పాటేనా అసలు? కంపోజిషన్, పాట పాడిన విధానం మొదటి నుంచి చివరి వరకూ ఒకే పిచ్ లో ఉంటుంది. గాయకులు వాళ్లకు ఎలా చెబితే అలా పాడతారు. వాళ్లను మానిటర్ చేసే బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్లది. ఒకవేళ ఆ పాట నాకు ఇచ్చి ఉంటే మరో లెవల్లో ఉండేది" అని ఈశ్వరి అనడం విశేషం.
ఈ తరం ఫిల్మ్ మేకర్స్, టెక్నీషియన్లపై కూడా ఈశ్వరి విమర్శలు గుప్పించింది. "మేము సీనియర్లం. సీనియర్లతో కలిసి మేము చేసిన సినిమాలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఆ రోజుల్లో సినిమాలు 100, 200 రోజులు ఆడేవి. ఈ రోజుల్లో 10 రోజులు ఓ సినిమా ఆడినా గొప్పే" అని ఈశ్వరి అభిప్రాయపడింది.
సంబంధిత కథనం