Koffee With Karan 8: ఇంకో బిడ్డను కను: ఆలియా భట్‍కు కరీనా సలహా.. ఎందుకంటే..-koffee with karan 8 kareena kapoor advises alia bhatt to have second child ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Koffee With Karan 8 Kareena Kapoor Advises Alia Bhatt To Have Second Child

Koffee With Karan 8: ఇంకో బిడ్డను కను: ఆలియా భట్‍కు కరీనా సలహా.. ఎందుకంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 14, 2023 04:18 PM IST

Koffee With Karan 8: కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ ఎపిసోడ్‍లో బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, కరీనా కపూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరో సంతానాన్ని పొందాలని ఆలియాకు కరీనా సలహా ఇచ్చారు. అలా ఎందుకు చెప్పారంటే..

హోస్ట్ కరణ్ జోహార్‌తో కరీనా కపూర్, ఆలియా భట్
హోస్ట్ కరణ్ జోహార్‌తో కరీనా కపూర్, ఆలియా భట్

Koffee With Karan 8: కాఫీ విత్ కరణ్ 8వ సీజన్‍లో తదుపరి ఎపిసోడ్‍కు గెస్టులుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆలియా భట్, కరీనా కపూర్ వచ్చారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఆలియా, కరీనా ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే వచ్చింది. నవంబర్ 16న ఈ ఎపిసోడ్ డిస్నీ+ హాట్‍స్టార్‌ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఈ ఎపిసోడ్‍లో మాట్లాడుకున్న కొన్ని విషయాలు తాజాగా వెల్లడయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

ఆలియా భట్ మరో బిడ్డను కనాలని ఆమెకు కరీనా కపూర్ సలహా ఇచ్చారు. వరుసకు మరదలు అయ్యే ఆలియాకు ఆమె ఈ సూచన చేశారు. ఆలియా ఓ సమస్య చెప్పగా దానికి పరిష్కారంగా ఈ సలహా ఇచ్చారు కరీనా. ఆ వివరాలివే..

హీరో రణ్‍బీర్ కపూర్, ఆలియా భట్ దంపతులకు గతేడాది నవంబర్ 6న ఆడబిడ్డ జన్మించారు. ఆమెకు రహా అని పేరు పెట్టారు. ఇటీవలే ఆ పాప మొదటి పుట్టిన రోజు కూడా గ్రాండ్‍గా జరిగింది. రహాను రణ్‍బీర్, ఆలియా ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ విషయంలోనే రణ్‍బీర్, ఆలియా మధ్య చిన్నపాటి గొడవ జరుగుతోందట. ఈ విషయాన్ని కాఫీ విత్ కరణ్ 8 షోలో ఆలియానే వెల్లడించారు. రహాను ఎక్కువసేపు ఎత్తుకుంటానంటూ ఇద్దరి మధ్య వాదన జరుగుతోందని అన్నారు.

“కొన్నిసార్లు, ఇంట్లో మేం రహా కోసం కొట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు రహా నీ దగ్గర ఉంది.. ఇప్పుడు నాకు ఇవ్వు” అంటూ అనుకుంటున్నాం అని ఆలియా చెప్పారు. దీనికి కరీనా ఉపాయం చెప్పారు.

మరో బిడ్డను కంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆలియాతో కరీనా చెప్పారు. “మీరు మరో సంతానాన్ని పొందాలి. అలా అయితే, చెరొకరు ఒక్కొక్కరిని ఆడించవచ్చు” అని కరీనా అన్నారు.

కాఫీ విత్ కరణ్ సీజన్ 8.. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతీ గురువారం కొత్త ఎపిసోడ్ వస్తోంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‍లో రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణ్ వచ్చారు. ఆ తర్వాత సన్నీ డియో బాబీ డియోల్, మూడో ఎపిసోడ్‍కు సారా అలీఖాన్, అనన్య పాండే గెస్టులుగా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సీజన్ నాలుగో ఎపిసోడ్‍కు ఆలియా భట్, కరీనా కపూర్ వస్తున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 16న స్ట్రీమింగ్‍కు రానుంది. 

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.