Bigg Boss Elimination: ఈ వీక్ ఊహించని ఎలిమినేషన్ - బిగ్‌బాస్ నుంచి కిరాక్ సీత ఔట్
Bigg Boss Elimination: ఈ వారం బిగ్‌బాస్ నుంచి కిరాక్ సీత ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో చివరగా మెహబూబ్, కిరాక్ సీత నిలిచినట్లు తెలిసింది. మెహబూబ్‌ను సేవ్ చేసిన నాగార్జున కిరాక్ సీతను ఎలిమినేట్ చేసినట్లు చెబుతోన్నారు.
Bigg Boss Elimination: ఈ వీక్ బిగ్‌బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ ఉండబోతుంది. బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి ఈ ఆదివారం కిరాక్ సీత ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ వీక్ నామినేషన్స్‌లో యష్మి, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కిరాక్ సీత, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. ఈ ఆరుగురిలో నామినేషన్స్‌లో చివరగా మెహబూబ్, కిరాక్ సీత ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్‌ను యూజ్ చేసి మెహబూబ్‌ను సేవ్ చేసిన నాగార్జున... కిరాక్ సీతను హౌజ్ నుంచి ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అతి తక్కువ ఓట్లు...
ఈ వారం ఓటింగ్‌లో కిరాక్ సీతకు అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలిసింది. ఓటింగ్‌లో గంగవ్వ, యష్మి టాప్‌లో ఉన్నట్లు సమాచారం. మెహబూబ్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ తర్వాతి స్థానాల్లో నిలిచారని అంటున్నారు. కిరాక్ సీత ఎలిమినేషన్‌కు ఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. సీతలో కామెడీ యాంగిల్ లేకపోవడం, ఆటలో సీరియస్‌నెస్ తగ్గిపోవడం వల్లే ఓట్లు తక్కువగా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రైజింగ్ స్టార్స్...ఫాలింగ్ స్టార్స్...
శనివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ఆటతీరును బట్టి రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్ అంటూ కంటెస్టెంట్స్‌ను విభజించాడు నాగార్జున. గంగవ్వ, మెహబూబ్, అవినాష్, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మిలను రైజింగ్ స్టార్స్‌గా నాగ్ పేర్కొన్నాడు. నబీల్, గౌతమ్ కృష్ణ, విష్ణుప్రియ, యష్మి, నిఖిల్, సీతలను ఫాలింగ్ స్టార్స్‌గా నాగార్జున చెప్పాడు. ప్రేరణ మాత్రం సగం రైజింగ్, సగం ఫాలింగ్ అని నాగార్జున అన్నాడు.
తేజకు పనిష్‌మెంట్...
గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని విష్ణుప్రియపై నాగార్జున ఫైర్ అయ్యాడు. నయనిపావని గురించి టేస్టీ తేజ మాట్లాడిన మాటలను నాగార్జున తప్పుపట్టాడు. అతడికి పనిష్‌మెంట్ ఇచ్చాడు. నాగమణికంఠ ఆటతీరు బాగుందని అతడిని మెచ్చుకున్నాడు.
గేటు దగ్గర బ్యాగులు...
ఇంట్లో ఉండేందుకు అర్హత లేని అపోజిట్ టీమ్‌లోని కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇంటి సభ్యులు చెప్పాలని, అర్హత లేని కంటెస్టెంట్స్ బ్యాగును గేటు దగ్గర పెట్టాలని నాగార్జున టాస్క్ ఇచ్చాడు. నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని అవినాష్ కంప్లైంట్ ఇచ్చి అతడి బ్యాగును గేటు దగ్గర పెట్టారు..పృథ్వీ బ్యాగును తేజ...నబీల్ పేరును హరితేజ సూచించింది. ప్రేరణను రోహిణి...మణికంఠ పేరును గంగవ్వ, మెహబూబ్ కూడా పృథ్వీ పేరును సూచించారు. వారి బ్యాగులను గేటు దగ్గర పెట్టారు.
ఆ తర్వాత గౌతమ్ బ్యాగును సీత...తేజ బ్యాగును నాగమణికంఠ గేటు దగ్గర పెట్టారు. పృథ్వీ, యష్మి ఇద్దరు తేజ పేరును చెప్పారు. చివరకు తేజ, పృథ్వీ, గౌతమ్ బ్యాగులను స్టోర్ రూమ్‌లో పెట్టించి సస్పెన్స్ క్రియేట్ చేశారు నాగార్జున.