Bigg Boss Sonia: బిగ్ బాస్‌లోకి ఆర్జీవీ హీరోయిన్ సోనియా రీ ఎంట్రీ కన్ఫర్మ్.. 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss Telugu8 Sonia Akula Re Entry Confirm: బిగ్ బాస్ తెలుగు 8లోకి ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల రీ ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లు సమాచారం. బిగ్ బాస్ 8 తెలుగులో నాలుగో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సోనియా ఆకుల మళ్లీ వస్తుందని తెలియడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Bigg Boss 8 Telugu Sonia Akula Re Entry Confirm: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఆడియెన్స్ చేత చాలా తిట్టించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సోనియా ఆకులనే. అంతలా ఆమె తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. అందుకే నామినేషన్స్‌లో ఉన్న మొదటి వారమే తక్కువ ఓట్లు వేసి సోనియాను బయటకు పంపించారు ఆడియెన్స్.
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో
కానీ, ఆడియెన్స్ మీదనో, బిగ్ బాస్‌పైనో రివేంజ్ తీర్చుకునేందుకు అన్నట్లుగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది సోనియా ఆకుల. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కథ అందించిన కరోనా వైరస్ సినిమాలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూతురు శాంతి పాత్రలో సోనియా ఆకుల నటించింది. అలాగే, ఆశ ఎన్‌కౌంటర్ సినిమాలో బాధితురాలు ఆశ పాత్రలో సోనియా మెయిన్ లీడ్ రోల్ చేసింది.
ఆర్జీవీకి ఉన్న పాపులారిటీతోనే సోనియాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందిని టాక్ నడిచింది. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియాను ముద్దుబిడ్డలా చూసుకుంది బీబీ టీమ్. బిగ్ బాస్ తెలుగు 8లోకి ఆరో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓంకు బడ్డీగా ఎంట్రీ ఇచ్చిన సోనియా మొదటి రెండు మూడు రోజులు బాగానే అలరించింది.
పర్సనల్ అటాక్
కానీ, ఆ తర్వాత ప్రతి ఒక్కరిపై విరుచుకుపడుతూ చెలరేగిపోయింది సోనియా. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియపై పర్సనల్ అటాక్ చేయడం, క్యారెక్టర్ తప్పుపట్టినట్లుగా మాట్లాడటం, ఆమెది అడల్ట్ రేటేడ్ కామెడీ అనడం వంటివి చాలా చేసింది. అలాగే, నామినేషన్స్‌లో యష్మీపై కూడా పర్సనల్ అటాక్ చేసింది. కానీ, దాన్ని కవర్ చేసే ప్రయత్నం గట్టిగానే చేసిన అది ఫలించలేదు.
ఇక హోస్ట్ నాగార్జున అయితే సోనియా విషయంలో పక్షపాతం చూపిపంచినట్లు చాలా సార్లు నిరూపితమైంది. ఆమె తప్పు చేసినా కూడా మెతగ్గా నచ్చజెప్పారే తప్ప గట్టిగా మందలించలేదు. ఇవేవి కాకుండా విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్ గేమ్‌ను సోనియా పాడు చేస్తుందని, అతన్ని బాగా కంట్రోల్ చేస్తున్నట్లు చాలా క్లియర్‌గా కనిపించింది. ఫ్రెండ్షిప్ పేరుతో నిఖిల్, పృథ్వీతో సోనియా మెదిలిన తీరు ఆడియెన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు.
రతిక రోజ్‌లాగే
అందుకే, సోనియా నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటిసారే ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించారు ఆడియెన్స్. కానీ, సోనియా ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ టీమ్ విశ్వప్రయత్నాలు చేసిన అవి ఫలించలేదు. కాబట్టి మళ్లీ తన ఫేవరెట్ కంటెస్టెంట్ సోనియాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ హౌజ్‌లోకి దింపుతున్నాడు బిగ్ బాస్. గత సీజన్‌లో రతిక రోజ్‌ను ఎలా రీ ఎంట్రీతో ఛాన్స్ ఇచ్చారో అలాగే సోనియా మళ్లీ బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టనుంది.
బిగ్ బాస్ తెలుగు 8లోకి సోనియా రీ ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. దీంతో ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. సోనియా చేసే రచ్చను ఎలా భరించాలో అని తమకు తామే పాపం అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో సోనియాతోపాటు జబర్దస్త్ అవినాష్, రోహిణి, హరితేజ, నయని పావని, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, మెహబూబ్ షేక్‌తో కలిపి ఎనిమిది మంది ఉన్నారు.