Bigg Boss Sunday Episode: అనుకున్నదే జరిగింది - శేఖర్ బాషా ఎలిమినేట్ - ఫేక్ కంటెస్టెంట్స్‌గా మణికంఠ, సోనియా
Bigg Boss Sunday Episode: అనుకున్నట్లుగానే ఈ వీక్ బిగ్‌బాస్ నుంచి శేఖర్ బాషా హౌజ్ ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన శేఖర్ బాషా జెన్యూన్ కంటెస్టెంట్స్‌గా కిరాక్ సీత, విష్ణుప్రియ, ప్రేరణ పేర్లు చెప్పాడు. ఫేక్ కంటెస్టెంట్స్‌గా మణికంఠ, సోనియా, ఆదిత్య ఓం లను పేర్కొన్నాడు.
Bigg Boss Sunday Episode: బిగ్‌బాస్ 8 తెలుగు సండే ఎపిసోడ్‌లో వచ్చి రావడంతోనే కంటెస్టెంట్స్‌ను శక్తి, కాంతార టీమ్‌లుగా విభజించారు నాగార్జున. రెండు టీమ్స్‌కు చిత్రం విచిత్రం అనే టాస్క్ ఇచ్చాడు. తొలుత శక్తి టీమ్ నుంచి పృథ్వీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. ప్రేరణతో బుల్లెట్ పాటకు పృథ్వీ డ్యాన్స్ చేశాడు. వారి డ్యాన్స్ చూసి విష్ణుప్రియ జెలసీగా ఫీలైంది. దాంతో పృథ్వీతో డ్యాన్స్ చేసే అవకాశాన్ని విష్ణుప్రియకు ఇచ్చాడు నాగార్జున. తన స్టెప్పులతో విష్ణుప్రియ అదరగొట్టింది.
ఆ తర్వాత ఆడిన ప్రశ్నకు శేఖర్ బాషా తప్పు ఆన్సర్ చెప్పడంతో శక్తి టీమ్‌కు వచ్చిన ఓ పాయింట్ పోయింది. ఆ తర్వాత అడిగిన ప్రశ్నలకు సోనియా హెల్ప్‌తో కాంతార టీమ్ రెండు కరెక్ట్స్ ఆన్సర్స్ చెప్పింది. మరోవైపు శక్తి టీమ్ తప్పులు చేస్తూ వచ్చింది. కానీ చివరలో పుంజుకున్న శక్తి టీమ్ వరుసగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పడంతో చిత్రం విచిత్రం టాస్క్ 4-4 పాయింట్లతో టైమ్ అయ్యింది. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ తమ డ్యాన్స్‌లతో ఇరగదీశారు.
హార్ట్ బ్రేక్ స్టోరీ...
స్కోరు టై కావడంతో హార్ట్ బ్రేక్ స్టోరీ చెప్పిన టీమ్‌ను విజేతగా ప్రకటిస్తానని నాగార్జున అన్నాడు.కిరాక్ సీత తన బ్రేకప్ స్టోరీ చెప్పింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో తన ఐదేళ్ల ప్రేమకథకు బ్రేకప్ పడినట్లు కిరాక్ సీత తెలిపింది. విఫల ప్రేమ బాధతో తాను దాదాపు 14 కేజీల బరువు కూడా తగ్గినట్లు చెప్పింది.
లవర్ తనను చీట్ చేశాడని అన్నది. ఇప్పుడు ఆలోచిస్తే లవ్ బ్రేకప్‌కు పడటమే మంచిదని అనిపిస్తుందని తెలిపింది. కిరాక్ సీత బ్రేకప్ స్టోరీతో శక్తి టీమ్ విన్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు.ఆ తర్వాత గిఫ్ట్ హ్యాంపర్ కావాలా? ప్రైజ్‌మనీ కావాలా అని నాగార్జున అడగ్గా ప్రైజ్‌మనీ కావాలని శక్తి టీమ్ చెప్పింది.
కలర్ బాస్క్ టాస్క్...
నామినేషన్‌లో ఉన్న నలుగురికి కలర్ బాక్స్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో కిరాక్ సీత, పృథ్వీ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత నామినేషన్స్‌లో ఉన్న ఆదిత్య ఓం, శేఖర్ భాషాలకు నాగార్జున కొత్త టాస్క్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు బిగ్‌బాస్‌లో ఉండాలో, ఎవరు ఎలిమినేట్ కావాలో కంటెస్టెంట్స్ పూల మాల మెడలో వేసి డిసైడ్ చేయాలని నాగార్జున అన్నాడు. ఎందుకు ఎలిమినేట్ కావాలో సరైన రీజన్స్ చెప్పాలని చెప్పారు.
ఈ టాస్క్‌లో ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ, సోనియా, యష్మి, పృథ్వీ, అభయ్ కూడా ఆదిత్య ఓం హౌజ్‌లో కొనసాగాలని, శేఖర్ బాషా ఎలిమినేట్ కావాలని అన్నారు. శేఖర్ బాషాలో గేమ్ పట్ల ఫోకస్ కనిపించడం లేదని కంప్లైంట్ చేశారు. శేఖర్ బాషాలో ఫస్ట్ వీక్‌లో ఉన్న జోష్ సెకండ్ వీక్‌లో తగ్గిందని అన్నారు. నిఖిల్, నబీల్, నైనిక కూడా ఆదిత్యకే ఓటు వేశారు. కిరాక్ సీత మాత్రమే శేఖర్ బాషా హౌజ్‌లో ఉండాలని అన్నది.
శేఖర్ బాషా ఎలిమినేట్
కంటెస్టెంట్స్ నిర్ణయంతో శేఖర్ బాషా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. శేఖర్ బాషా ఎలిమినేట్ కానుండటంతో కిరాక్ సీత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నది. ఆదిత్య ఓం, నబీల్ కలిసి శేఖర్‌ను తమ భుజాలపై ఎత్తుకొని సెండాఫ్ ఇచ్చారు. కిరాక్ సీతను నిఖిల్ ఓదార్చాడు.
ఫేక్, జెన్యూన్ టాస్క్...
హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినా శేఖర్ బాషాకు నాగార్జున ముగ్గురు ఫేక్ కంటెస్టెంట్స్, ముగ్గురు రియల్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. ఇందులో రియల్ కంటెస్టెంట్‌గా సీత, విష్ణుప్రియ, ప్రేరణలను పేర్కొన్నాడు శేఖర్ బాషా. కిరాక్ సీతతో మాట్లాడితే చెల్లితో మాట్లాడినట్లు ఉంటుందని అన్నాడు. విష్ణుప్రియ ఇన్నోసెంట్ అని శేఖర్ బాషా చెప్పాడు. ప్రేరణను జెన్యూన్, ఎనర్జిటిక్‌గా పేర్కొన్నాడు.
ఫేక్ కంటెస్టెంట్స్‌గా సోనియా, మణికంఠ, ఆదిత్య ఓం లనుపేర్కొన్నాడు. సోనియా నవ్వు చూసి తొలుత ప్రశాంతంగా ఫీలయ్యానని, కానీ నామినేషన్స్‌లో మహంకాళి అవతారం చూశానని అన్నాడు. మణికంఠ కావాలనే ఎప్పుడు ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడని, ప్రతిదానికి లెక్కలు వేసుకుంటాడని శేఖర్ బాషా చెప్పాడు.
ఆదిత్య ఓం తనను మూడుసార్లు నామినేట్ చేస్తే స్పోర్టివ్‌గా తీసుకున్నానని, కానీ తాను ఒక్కసారి ఆదిత్యను నామినేట్ చేస్తే అతడు తట్టుకోలేకపోయాడని శేఖర్ బాషా అన్నాడు. ఆ తర్వాత శేఖర్ బాషాకు అందరూ కంటెస్టెంట్స్ వీడ్కోలు పలికారు.