Bigg Boss Telugu 7: “నా మైండ్ నా ఇష్టం.. నీ మైండ్ నీ ఇష్టం”: రతికకు ప్రశాంత్ పంచ్.. కెప్టెన్సీ టాస్క్‌లో హీట్-war world between pallavi prashanth and ratika rose in bigg boss 7 telugu last captaincy task ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  War World Between Pallavi Prashanth And Ratika Rose In Bigg Boss 7 Telugu Last Captaincy Task

Bigg Boss Telugu 7: “నా మైండ్ నా ఇష్టం.. నీ మైండ్ నీ ఇష్టం”: రతికకు ప్రశాంత్ పంచ్.. కెప్టెన్సీ టాస్క్‌లో హీట్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 24, 2023 02:07 PM IST

Bigg Boss Telugu 7 Day 82 Promo: బిగ్‍బాస్‍లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్‌ కూడా హీట్‍గా జరిగింది. కొందరు కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. శివాజీ విషయంలో ప్రశాంత్‍ను సందిగ్ధంలో పెట్టారు బిగ్‍బాస్. ఆ వివరాలివే..

Bigg Boss Telugu 7: “నా మైండ్ నా ఇష్టం.. నీ మైండ్ నీ ఇష్టం”: రతికకు ప్రశాంత్ పంచ్
Bigg Boss Telugu 7: “నా మైండ్ నా ఇష్టం.. నీ మైండ్ నీ ఇష్టం”: రతికకు ప్రశాంత్ పంచ్

Bigg Boss Telugu 7 Day 82 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో లాస్ట్ కెప్టెన్సీ కోసం పోటీ షురూ అయింది. తదుపరి కెప్టెన్‍ను ఎంపిక చేసుకునే ప్రక్రియను మళ్లీ కంటెస్టెంట్లకే బిగ్‍బాస్ అప్పగించారు. ఇందులో భాగంగా మెషిన్ గన్ అనే టాస్క్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు కంటెస్టెంట్ల మధ్య వాదనలు జరిగాయి. పల్లవి ప్రశాంత్, రతిక మధ్య గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన నేటి ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఏముందంటే..

ట్రెండింగ్ వార్తలు

హౌస్‍లో జరిగే ఆఖరి కెప్టెన్సీ అని బిగ్‍బాస్ ప్రకటించారు. గన్ షూటింగ్ సౌండ్ వినపడిన ప్రతీసారి గార్డెన్‍లోని మిషన్ గన్ వద్దకు వెళ్లే ఇద్దరు కిల్లింగ్ జోన్‍లో ఫొటోలు ఉన్న ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసులో ఉంచాలని బిగ్‍బాస్ చెప్పారు. ఆ ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీలో ఉండకూడదని అనుకుంటే వారి ఫొటోను షూట్ చేసి రేసు నుంచి తప్పించాల్సి ఉంటుందని సూచించారు.

ముందుగా గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్ గన్ దగ్గరికి వెళ్లగా.. వారికి అర్జున్, శోభా శెట్టి ఫొటోలు వచ్చాయి. ఇద్దరూ మనల్ని కోపంగా చూస్తున్నారని ప్రియాంకతో అర్జున్ అన్నారు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి శోభాశెట్టి ఫొటోను షూట్ చేశారు. దీంతో ఆమెను కెప్టెన్సీ టాస్కు నుంచి తప్పించారు. ఇద్దరిలో పోల్చుకుంటే అర్జున్ గేమ్ ఫెయిర్‌గా ఉందని గౌతమ్ అన్నారు. దీంతో ఫెయిర్ గేమ్ అంటే అని శోభ ప్రశ్నించారు. అయితే, అమర్‌ను గెలిపించాలని పక్కని వారిని కూడా ప్రభావితం చేస్తున్నావంటూ శోభతో గౌతమ్ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది.

ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి రాగా.. వారికి అమర్ దీప్, అశ్వినీశ్రీ ఫొటోలు వచ్చాయి. తాను అమర్‌కే సపోర్ట్ చేస్తానని శోభ చెప్పేశారు. ప్రశాంత్ కూడా అమర్‌కే మద్దతు తెలిపారు. కెప్టెన్సీ కోసం అమర్‌లో ఏముందో తనలో ఏం లేదో తెలియడం లేదని అశ్వినీ అన్నారు. “ఇంకెవ్వరైనా తీసేస్తున్నారన్న పట్టించుకోను. కానీ నువ్వు నన్ను తీసేస్తున్నావు చూడు” అని ప్రశాంత్‍తో అశ్వినీ అన్నారు.

ఆ తర్వాత ప్రిన్స్ యావర్, రతిక మెషిన్ గన్ వద్దకు వెళ్లగా.. శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫొటోలు వచ్చాయి. దీంతో గురుశిష్యులుగా భావించే శివాజీ, ప్రశాంత్, యావర్ తికమకలో పడ్డారు. “శివాజీ ఫొటోను కాల్చాలని నువ్వు అంటున్నావా” అని యావర్ ప్రశ్నించడంతో ప్రశాంత్ ఏమీ చెప్పలేకపోయారు. విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇతర కంటెస్టెంట్లు కూడా అతడిని ఆటపట్టించేలా మాట్లాడారు.

ఆల్రెడీ మైండ్‍లో ఒకటి ఫిక్స్ అయ్యావు కదా అని ప్రశాంత్‍తో రతిక అన్నారు. దీంతో “నా మైండ్ నా ఇష్టం. నీ మైండ్ నీ ఇష్టం” అని ప్రశాంత్ వాదించారు. చివరికి ప్రశాంత్ ఫొటోను యావర్, రతిక కాల్చేసి అతడిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించారు. ఆఖరి కెప్టెన్సీ రేసులో ఎవరు ఉండనున్నారో నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.