Kalyani Malik On Rajamouli: అవార్డుల గురించి రాజమౌళి ఎప్పుడూ ఆలోచించలేదు - కళ్యాణి మాలిక్ కామెంట్స్ వైరల్
Kalyani Malik On Rajamouli: రాజమౌళి అవార్డులపై ఎప్పుడూ దృష్టిపెట్టలేదని అన్నాడు ఆయన సోదరుడు కళ్యాణి మాలిక్. ఓ షోలో రాజమౌళిపై కళ్యాణి మాలిక్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Kalyani Malik On Rajamouli: రాజమౌళి అవార్డులపై ఎప్పుడూ దృష్టిసారించలేదని కీరవాణి సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొని చరిత్రను సృష్టించింది.
నాటు నాటు పాటకుగాను బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్‌ను సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పురస్కారం దక్కించుకోవడంపై రాజమౌళితో పాటు కీరవాణిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రైమ్ మినిస్టర్ మోదీ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రాజమౌళి, కీరవాణి ప్రతిభను కొనియాడుతున్నారు.
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంపై కీరవాణి, రాజమౌళి ఫ్యామిలీలలో సెలబ్రేషన్స్‌కు సంబంధించి వారి సోదరుడు కళ్యాణి మాలిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ షోకు గెస్ట్‌గా హాజరైన అతడు రాజమౌళితో పాటు తమ ఇంట్లోని వారు అవార్డులపై ఎప్పుడూ దృష్టిపెట్టలేదని కళ్యాణి మాలిక్ అన్నాడు.
తాను చేసిన సినిమాలు జనాలకు రీచ్ అవ్వడంతో పాటు హిట్ కావాలనే రాజమౌళి కోరుకున్నాడనికళ్యాణి మాలిక్ చెప్పాడు. కీరవాణి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుందని చెప్పాడు. అదే తమ ఫ్యామిలీలో గొప్ప విషయమని కళ్యాణి మాలిక్ అన్నాడు.