KBC 16 Cricket Question: మీకు క్రికెట్ గురించి మొత్తం తెలుసా? అయితే రూ.50 లక్షల విలువైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?
KBC 16 Cricket Question: మీకు క్రికెట్ పైన మంచి పట్టుందా? ఎలా ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలమనే నమ్మకం ఉందా? అయితే కేబీసీ 16లో అడిగిన ఈ కఠినమైన ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో చూడండి.
KBC 16 Cricket Question: కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ) 16వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఈ క్విజ్ షోలో తాజాగా క్రికెట్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. దీని విలువ రూ.50 లక్షలు. ఇది చూడటానికి సింపుల్ గానే అనిపించినా.. అంత ఈజీ కాదు. మరి దీని ద్వారా మీ క్రికెట్ నాలెడ్జ్ ను పరీక్షించుకోండి.
కేబీసీ16లో అడిగిన ప్రశ్న ఇదే..
కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ)లో గురువారం (సెప్టెంబర్ 26) వచ్చిన ఎపిసోడ్లో అభిషేక్ సంధు అనే కంటెస్టెంట్ ను అమితాబ్ బచ్చన్ క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. అప్పటికే రూ.25 లక్షలు గెలిచిన అతడు.. రూ.50 లక్షల కోసం ప్రయత్నించినా.. దీనికి సమాధానం చెప్పలేక గేమ్ వదిలేశాడు.
ఇంతకీ క్రికెట్ పై అడిగిన ఆ ప్రశ్న ఏంటో తెలుసా? "ఫస్ట్ క్లాస్ క్రికెట్ డెబ్యూలోనే డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు?" ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఆర్థర్ ష్రూస్బరీ, డబ్ల్యూజీ గ్రేస్, డౌగ్ ఇన్సోల్, టామ్ మార్స్‌డెన్ లలో ఎవరు ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారన్నది ఆ ప్రశ్న.
దీనికి సరైన సమాధానం ఏదో మీకు తెలిసిందా? అప్పటికే గేమ్ వదిలేయడంతో సదరు కంటెస్టెంట్ ఓ ఆన్సర్ గెస్ చేసినా.. అది తప్పని తేలింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అయిన టామ్ మార్స్‌డెన్. అతడు సుమారు రెండు వందల ఏళ్ల కిందట అంటే 1826లో తాను ఆడిన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లోనే 227 రన్స్ చేశాడు. క్రికెట్ పై ఎంత పట్టు ఉన్నా.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మాత్రం అంత సులువు కాదని తెలిసిందా?
రూ.25 లక్షల ప్రశ్న ఇదీ..
క్రికెట్ గురించిన ఆ ప్రశ్న అలా ఉంచితే.. రూ.25 లక్షలకు సంబంధించిన ప్రశ్న కూడా కాస్త కఠినంగానే ఉంది. 1958 నుంచి 1961 మధ్య ఉన్న యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ఏ రెండు దేశాల మధ్య కుదిరిన రాజకీయ కూటమి అన్నది ఆ ప్రశ్న. దీనికి ఆప్షన్లుగా సిరియా-జోర్డాన్, ఇరాన్-ఇరాక్, ఈజిప్ట్-సిరియా, ఒమన్-యెమన్ ఇచ్చారు.
దీనికి సమాధానం చెప్పడానికి సదరు కంటెస్టెంట్ డబుల్ డిప్ ఆప్షన్ తీసుకున్నారు. అంటే రెండు సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. మొదటి సమాధానంగా ఒమన్-యెమన్ అని చెప్పగా అది తప్పని తేలింది. ఇక రెండో సమాధానం అయిన ఈజిప్ట్-సిరియా సరైనదని తేలింది.
దీంతో అతనికి రూ.25 లక్షలు దక్కాయి. ఆగస్ట్ 12న ప్రారంభమైన కేబీసీ 16వ సీజన్ లో ఈ మధ్యే చందేర్ ప్రకాశ్ అనే వ్యక్తి రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ క్విజ్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటలకు సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.