KBC 16 Winner: కౌన్ బనేగా క్రోర్‌పతి 16లో తొలి కోటీశ్వరుడు ఇతనే! కోటి రూపాలయతోపాటు ఏం గెలుచుకున్నాడో తెలుసా?-amitabh bachchan hugs kaun banega crorepati 16 winner chander prakash who first crorepati and lost 7 crore question ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kbc 16 Winner: కౌన్ బనేగా క్రోర్‌పతి 16లో తొలి కోటీశ్వరుడు ఇతనే! కోటి రూపాలయతోపాటు ఏం గెలుచుకున్నాడో తెలుసా?

KBC 16 Winner: కౌన్ బనేగా క్రోర్‌పతి 16లో తొలి కోటీశ్వరుడు ఇతనే! కోటి రూపాలయతోపాటు ఏం గెలుచుకున్నాడో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Sep 26, 2024 12:02 PM IST

Kaun Banega Crorepati 16 Winner Chander Prakash: కౌన్ బనెగా క్రోర్‌పతి 16 సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి విజేతగా చంతదర్ ప్రకాష్ నిలిచారు. రూ. కోటితోపాటు విలువైన వస్తువు గెలుచుకున్న చందన్ ప్రకాష్‌ను బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కౌన్ బనేగా క్రోర్‌పతి 16లో తొలి కోటీశ్వరుడు ఇతనే! కోటి రూపాలయతోపాటు ఏం గెలుచుకున్నాడో తెలుసా?
కౌన్ బనేగా క్రోర్‌పతి 16లో తొలి కోటీశ్వరుడు ఇతనే! కోటి రూపాలయతోపాటు ఏం గెలుచుకున్నాడో తెలుసా?

Amitabh Bachchan KBC 16 Winner: ప్రముఖ హిందీ రియాలిటీ షో కోన్ బనెగా క్రోర్‌పతి మంచి ఆదరణతో దూసుకుపోతోంది. ఊహించని ప్రశ్నలు, సమాధానాలతో సాగే ఈ షో ఇప్పటికీ 15 పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. కేబీసీ 16కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) సీజన్ 16లో కంటెస్టెంట్ చందర్ ప్రకాష్ తొలి కోటీశ్వరుడుగా నిలిచారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్న కేబీసీ విన్నర్ చందర్‌ను ప్రశంసిస్తూ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ఛానెల్ బుధవారం (సెప్టెంబర్ 25) ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పోస్ట్ చేసింది.

తొలి కోటీశ్వరుడు

ఈ వీడియోలో అమితాబ్ ప్రేక్షకుల ముందు నిలబడి 'కోటి రూపాయలు' అని అరిచాడు. దాంతో చందర్‌ ప్రకాష్‌కు ప్రజలు చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అప్పుడు అమితాబ్ 'గాలే లగ్జైయే ఆప్ హుమారే (కౌగిలించుకుందాం)' అంటూ ఆయనను కౌగిలించుకున్నారు.

'ఈ సీజన్‌కే పెహ్లే కరోడ్‌పతి, చందర్ ప్రకాష్ కో హమ్ సబ్ కీ ఓరే సే హార్దిక్ శుభకామ్నేయే (ఈ సీజన్ తొలి కోటీశ్వరుడు చందర్ ప్రకాష్‌కు మా శుభాకాంక్షలు)' అనే క్యాప్షన్‌తో సోనీ ఎంటర్టైన్‌మెంట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. చందర్ ప్రకాష్ కోటి రూపాయలు గెలుచుకోవడం మాత్రమే కాకుండా ఖరీదైన కారును కూడా అందుకున్నాడని మరో వీడియోలో అమితాబ్ బచ్చన్ ప్రేక్షకులతో చెప్పారు.

రూ. కోటి గెలుచకున్న చందర్ ప్రకాష్‌ను తర్వాత రూ.7 కోట్ల ప్రశ్న అడిగారు అమితాబ్ బచ్చన్. అయితే, దానికి చందర్ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో షో నుంచి కంటెస్టెంట్‌గా చందర్ ప్రకాష్ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ, మొత్తానికి రూ. కోటితోపాటు ఓ కారు గెలుచుకున్న చందర్ ప్రకాష్ కౌన్ బనెగా క్రోర్‌పతి సీజన్ 16 తొలి కోటీశ్వరుడిగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు.

కోటి రూపాయల ప్రశ్న?

కాగా, కేబీసీ 16లో చందర్‌ను తొలి కోటీశ్వరుడిని చేసిన కోటి రూపాయల ప్రశ్న ఏంటంటే.. "శాంతి నివాసం అని అర్థం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవును కలిగి దేశ రాజధాని కానీ అతిపెద్ద నగరం ఉన్న దేశం ఏది?". దీనికి ఎ) సోమాలియా, బి) ఒమన్, సి) టాంజానియా, డి) బ్రూనై అనేవి ఆప్షన్స్. 'డబుల్ డిప్' లైఫ్ లైన్ ఉపయోగించిన తర్వాత చందర్ ప్రకాష్ టాంజానియా అని సరైన సమాధానం చెప్పారు. దాంతో కోటి రూపాయలు గెలుచుకున్నారు.

రూ.7 కోట్ల ప్రశ్న ఏంటంటే?

కోటి రూపాయల ప్రశ్న తర్వాత చందర్‌ను అమితాబ్ రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. "1587లో నార్త్ అమెరికాలో ఆంగ్ల తల్లిదండ్రులకు జన్మించి మొదటిగా నమోదు చేయబడిన బిడ్డ ఎవరు?" ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతోపాటు లైఫ్ లైన్స్ కూడా అయిపోవడంతో షో నుంచి తప్పుకున్నారు చందర్ ప్రకాష్.

అనంతరం చందర్‌ను సరదాగా గెస్ చేయమని అమితాబ్ చెప్పారు. దానికి చందర్ ఆప్షన్ ఎ) వర్జీనియా డేర్‌ అని చెప్పారు. అయితే, అది సరైన సమాధానం అని అమితాబ్ చెప్పారు. ఇలా సమాధానం తెలిసినా చెప్పకుండా రూ. 7 కోట్లను కోల్పోయారు చందర్ ప్రకాష్.

ఎవరీ చందర్ ప్రకాష్?

జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు చందర్ ప్రకాష్ యూపీఎస్సీ అభ్యర్ధి. జీవితంలో అనేక ఆరోగ్య అవరోధాలతో పోరాడానని గతంలో చందర్ ఈ షోలో పంచుకున్నారు. అతను పుట్టుకోతోనే పేగు సమస్యతో జన్మించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు చందర్‌కు ఏడు శస్త్ర చికిత్సలు జరిగాయని చెప్పారు. అయినా.. ఇప్పటికీ పేగు సమస్యలు వెంటాడుతున్నాయని, ఎనిమిదో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పినట్లు చందర్ వెల్లడించారు.