Kantara Chapter 1 first look: కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది.. భీకరంగా రిషబ్ శెట్టి: వీడియో చూసేయండి-kantara chapter 1 teaser and first look released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Chapter 1 First Look: కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది.. భీకరంగా రిషబ్ శెట్టి: వీడియో చూసేయండి

Kantara Chapter 1 first look: కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది.. భీకరంగా రిషబ్ శెట్టి: వీడియో చూసేయండి

Kantara Chapter 1 First Look Teaser: ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది. గతేడాది వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‍గా ఈ చాప్టర్ 1 వస్తోంది. ఈ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది.

Kantara Chapter 1 Teaser: కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది.. భీకరంగా రిషబ్ శెట్టి

Kantara Chapter 1 First Look, Teaser: రిషబ్ శెట్టి హీరోగా నటించి, తానే దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమా గతేడాది సంచలన విజయం సాధించింది. ముందుగా కన్నడలో బ్లాక్‍బాస్టర్ అయింది. ఆ తర్వాత తెలుగు, హిందీ సహా మరిన్ని భాషల్లో డబ్ అయి రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని చోట్ల కాంతార బంపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్లతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. ఈ సినిమాతో కన్నడ పరిశ్రమ వైపు దేశమంతా చూసింది. ఇప్పుడు కాంతార సినిమాకు ప్రీక్వెల్‍గా ‘కాంతార చాప్టర్ 1’ వస్తోంది. ‘కాంతార - ఏ లెజెండ్ చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ నేడు (నవంబర్ 27) రిలీజ్ అయింది.

‘కాంతార - ఏ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్‍లో రిషబ్ శెట్టి లుక్ బీభత్సంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో గెటప్ చాలా డిఫరెంట్‍గా ఉంది. దేహమంతా రక్తపు మరకలు, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం, పొడవు జుట్టు, గడ్డంతో రిషబ్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. కదంబల కాలంలో జన్మించిన ఓ లెజెండ్ కథగా ఫస్ట్ లుక్ టీజర్లో పేర్కొన్నారు మేకర్స్. ఈ టీజర్ ఆరంభంలో కాంతారలో శివ (రిషబ్ శెట్టి) కనిపిస్తారు. తన తండ్రి (రిషబ్ శెట్టి) మాయమైన చోటికి వెళ్లి నిలబడతాడు. అక్కడి నుంచి చంద్రుడిని చూస్తారు. అప్పుడు ఈ లెజెండ్ (రిషబ్) ఆగమనం ఉంది. వెలుతురులో అన్నీ కనిపిస్తాయంటూ ఇంగ్లిష్‍లో వాయిస్ ఓవర్ ఉంది.

కాంతార చాప్టర్-1 చిత్రానికి కూడా హీరో రిషబ్ శెట్టినే కథ, దర్శకత్వం వహిస్తున్నారు. హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

కాంతార చిత్రంలో శివ (రిషబ్ శెట్టి) స్టోరీని మేకర్స్ చూపించారు. అయితే, కాంతార పార్ట్ 1లో శివ తండ్రి (రిషబ్ శెట్టి) కథను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కాంతారలో రిషబ్ శెట్టి.. శివతో పాటు తండ్రి పాత్రలోనూ డ్యుయల్ రోల్‍ చేశారు.