Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్‌తో డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్-kannappa teaser to come on 14th june manchu vishnu announced the date with a new poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్‌తో డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్‌తో డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Hari Prasad S HT Telugu
Jun 07, 2024 07:23 PM IST

Kannappa Teaser: కన్నప్ప మూవీ టీజర్ వచ్చేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను ఓ కొత్త పోస్టర్ తో మంచు విష్ణు అనౌన్స్ చేశాడు. దీంతో టీజర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కన్నప్ప టీజర్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్‌తో డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
కన్నప్ప టీజర్ వచ్చేస్తోంది.. అదిరిపోయే పోస్టర్‌తో డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Kannappa Teaser: మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మధ్యే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ టీజర్ ను ప్రదర్శించగా.. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం (జూన్ 7) సోషల్ మీడియా ద్వారా మంచు విష్ణు అనౌన్స్ చేశాడు. మరో వారం రోజుల్లోనే ఈ మచ్ అవేటెడ్ మూవీ టీజర్ రాబోతోంది.

కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్

కన్నప్ప మూవీలో మంచు విష్ణుయే టైటిల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా అతడే. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. "కేన్స్ లో లభించిన అపూర్వ అభినందనల తర్వాత ఈ అద్భుతమైన కథ కన్నప్ప టీజర్ ను జూన్ 14న మీ ముందుకు తీసుకువస్తున్నామని చెప్పడానికి థ్రిల్లింగా ఉంది.

ఈ సినిమాకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అనే క్యాప్షన్ తో టీజర్ రిలీజ్ విషయాన్ని మంచు విష్ణు వెల్లడించాడు.

గత నెలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిన విషయం తెలిసిందే. అక్కడ మే 20వ తేదీన ఈ కన్నప్ప టీజర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కు మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభుదేవా వెళ్లారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఓ అంతర్జాతీయ వేదికపై మూవీ టీజర్ లాంచ్ చేయడంపై విష్ణు గతంలో స్పందించాడు.

"కేన్స్ లో కన్నప్ప టీజర్ లాంచ్ చేశాం. దీనికి పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు, స్థానిక భారతీయులు, ప్రతి ఒక్కరికీ ఈ టీజర్ బాగా నచ్చింది. ఇలాంటి రియాక్షన్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది" అని విష్ణు వెల్లడించాడు.

భారీ బడ్జెట్‌తో కన్నప్ప మూవీ

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ కన్నప్ప మూవీని నిర్మిస్తున్నాడు. పరమ శివుడి భక్తుడైన కన్నప్ప కథను ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే అతని షూటింగ్ పార్ట్ ముగిసింది. ఇక నందీశ్వరుడి పాత్రలో ప్రభాస్ నటించాడు.

ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట చేస్తున్నాడు. రూ.300 కోట్లకుపైగా బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ మూవీలో విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, మధూ, శరత్ కుమార్, ప్రభుదేవా, బ్రహ్మానందం, ముకేశ్ రిషిలాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో కన్నప్పను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, మలయాళం భాషల్లోనూ కన్నప్ప రానుంది.

చాలా రోజులుగా మంచు విష్ణుకు ఓ హిట్ దక్కలేదు. దీంతో ఈ కన్నప్పపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మరి విష్ణు కెరీర్ ను మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.

టీ20 వరల్డ్ కప్ 2024