Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?-kajal agarwal in manchu vishnu kannappa after mosagallu movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

Sanjiv Kumar HT Telugu
May 17, 2024 03:39 PM IST

Kajal Agarwal In Manchu Vishnu Kannappa: మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్పలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. దీని మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇదివరకు మంచు విష్ణుకు కాజల్ అగర్వాల్ చెల్లెలిగా నటించింది. మరి కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?
మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

Kajal Agarwal In Kannappa Movie: డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప (Kannappa 2024) నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించేసుకోవడం, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్ కాసాగింది.

కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తోంది. ఈ మేరకు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇదివరకు విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు (Mosagallu Movie) మూవీని చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అన్నా చెల్లెల్లుగానటించారు. రూ. 51 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మోసగాళ్లు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అందుకుంది.

ఇప్పుడు కాజల్ అగర్వాల్ మరోసారి మంచు విష్ణుతో నటించనుంది. మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప చిత్రంలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు. అయితే ఆమె పాత్రపై పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణుకు చెల్లెలిగా నటించిన కాజల్ అగర్వాల్ కన్నప్ప సినిమాలో ఎలాంటి పాత్రలో చేస్తోందనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే.

కాగా కాజల్ అగర్వాల్ చాలా కాలం తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. త్వరలో కాజల్ అగర్వాల్ సత్యభామ (Satyabhama Movie) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో దర్శనం ఇవ్వనుంది. ఇందులో హీరోగా నవీన్ చంద్ర చేస్తున్నాడు.

కన్నప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు.

మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను మరింత పెంచనున్నారు. ఇదిలా ఉంటే, సినిమాలతో ఎంటర్టేన్ చేస్తున్న మంచు విష్ణు చివరిగా జిన్నా మూవీతో అలరించాడు.