Civil Engineer Teaser Out: పునీత్ రాజ్‌కుమార్ సివిల్ ఇంజినీర్ టీజర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి-kannada power star puneeth rajkumar action entertainer civil engineer teaser out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kannada Power Star Puneeth Rajkumar Action Entertainer Civil Engineer Teaser Out Now

Civil Engineer Teaser Out: పునీత్ రాజ్‌కుమార్ సివిల్ ఇంజినీర్ టీజర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
Oct 05, 2022 05:04 PM IST

Civil Engineer Teaser: దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన సివిల్ ఇంజినీర్ టీజర్ విడుదలైంది. ఆయన నటించిన చక్రవ్యూహ సినిమాలో గతంలో సూపర్ సక్సెస్ అయింది. దీన్ని తెలుుగలో సివిల్ ఇంజినీర్ పేరుతో డబ్ చేయనున్నారు.

పునీత్ రాజ్ కుమార్
పునీత్ రాజ్ కుమార్ (Feed)

Puneeth Rajkumar Civil Engineer Teaser: కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన మునుపటి చిత్రం "యువరత్న" కన్నడ, తెలుగు రెండింటిలోనూ విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. దీంతో ఆయన గత చిత్రాలను తెలుగులో విడుదల చేసే పనిలో పడ్డారు తెలుగు నిర్మాతలు. తాజాగా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన చక్రవ్యూహ ఇప్పుడు "సివిల్ ఇంజినీర్" గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.

చక్రవ్యూహ చిత్రం, శాండల్‌వుడ్‌లో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. దసరా సందర్భంగా, మేకర్స్ సివిల్ ఇంజనీర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయితే సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది.

కన్నడ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరింత సంచలనం సృష్టిస్తుందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చందన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు మరియు దీనిని T.N.సూరిబాబు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

పునీత్ రాజ్ కుమార్ యొక్క "చక్రవ్యూహ", కోలీవుడ్ చిత్రం "ఇవాన్ వెరమాతిరి"కు కన్నడ రీమేక్. ఈ చిత్రంలో రచితా రామ్ స్త్రీ పాత్రలో నటించారు. తమిళ నటుడు అరుణ్ విజయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. తమిళ దర్శకుడు ఎం శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోహిత్ నిర్మించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్