Abhay Movie: థియేటర్లలో రిలీజైన 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన కమల్‌హాసన్ సైకో థ్రిల్లర్ మూవీ!
Abhay Movie: కమల్‌హాసన్ ఆళవందన్ మూవీ (తెలుగులో అభయ్) మూవీ థియేటర్లలో రిలీజైన 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కమల్ హాసన్ సైకో కిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Abhay Movie: ప్రస్తుతం థియేటర్లకు, ఓటీటీలకు మధ్య గ్యాప్ చాలా తగ్గింది. స్టార్ హీరోల సినిమాలు సైతం థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోన్నాయి. చిన్న...మిడ్ రేంజ్ హీరోల సినిమాలు వారం నుంచి రెండు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతోన్నాయి.
23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి....
కమల్‌హాసన్ హీరోగా నటించిన తమిళ మూవీ ఆళవందన్ (తెలుగులో అభయ్) ఏకంగా థియేటర్లలో రిలీజైన 23 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆళవందన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియెన్స్ కోసం 4కే వెర్షన్‌ను రిలీజ్ చేశారు.
2001లో రిలీజ్...
2001లో థియేటర్లలో రిలీజైన అభయ్ మూవీలో కమల్‌హాసన్ డ్యూయల్ రోల్ చేశాడు. ఆర్మీ ఆఫీసర్‌గా, సైకో కిల్లర్‌గా కమల్ హాసన్ ఈ సినిమాలో కనిపించాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవీనా టాండన్, మనీషా కోయిరాలా హీరోయిన్లుగా నటించారు. తొలుత ఈ మూవీలో రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్‌లను హీరోయిన్లుగా తీసుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఐశ్వర్యరాయ్, రాణిముఖర్జీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
కమర్షియల్ ఫెయిల్యూర్...
ఎక్స్‌పీరిమెంటల్ మూవీగా థియేటర్లలో రిలీజైన అభయ్ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కమల్‌హాసన్ నటన కారణంగా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ మూవీగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది. కమల్‌హాసన్ కెరీర్‌లో టాప్ టెన్ బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో హీరోగా...విలన్‌గా రెండు పాత్రల్లో కమలే కనిపించారు. ఈ క్యారెక్టర్స్‌లో ఆయన చూపించిన వేరియేషన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అభయ్‌గా తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టాడు కమల్‌హాసన్.
25 కోట్ల బట్జెట్...
అప్పట్లోనే దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో అభయ్ సినిమాను నిర్మించడం దక్షిణాదితో పాటు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2001లో రూపొందిన భారీ బడ్జెట్ మూవీల్లో ఒకటిగా అభయ్ రికార్డ్ నెలకొల్పింది. కానీ పెట్టిన పెట్టుబడిలో సగం వసూళ్లను కూడా ఈ మూవీ రాబట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం పదిహేను కోట్ల లోపే కలెక్షన్స్ సాధించింది.
కలెక్షన్స్ రాకున్నా అవార్డులను మాత్రం అభయ్ తెచ్చిపెట్టింది. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డును దక్కించుకున్నది. మార్చి నెలలో 4కే టెక్నాలజీతో అభయ్ మూవీని తమిళంలో రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌లోనూ మంచి వసూళ్లను ఈ మూవీ రాబట్టింది. అభయ్ సినిమాకు ప్రస్తుత తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన జయం రవి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
ఐదు సినిమాలు...
ప్రస్తుతం సినిమాల పరంగా యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తోన్నాడు కమల్ హాసన్. ఏకంగా ఐదు సినిమాలు చేస్తోన్నాడు. కమల్ హాసన్ శంకర్ కాంబోలో రూపొందిన ఇండియన్ 2 మూవీ ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మణిరత్నంతో థగ్ లైఫ్ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు కమల్‌హాసన్.
తెలుగులో ప్రభాస్ కల్కి మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. వీటితో పాటు కమల్‌హాసన్ నటించనున్న మరో రెండు సినిమాలు డిస్కషన్స్‌లో ఉన్నాయి. మరోవైపు ప్రొడ్యూసర్‌గా కూడా శివకార్తికేయన్‌తో అమరన్ అనే సినిమా చేస్తున్నాడు కమల్‌హాసన్. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది