Kajal Satyabhama Trailer: కాజల్ యాక్షన్ అవతార్.. స్టంట్స్‌తో అదరగొట్టిన సత్యభామ.. ట్రైలర్ వచ్చేసింది-kajal satyabhama trailer released balakrishna graced the event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Satyabhama Trailer: కాజల్ యాక్షన్ అవతార్.. స్టంట్స్‌తో అదరగొట్టిన సత్యభామ.. ట్రైలర్ వచ్చేసింది

Kajal Satyabhama Trailer: కాజల్ యాక్షన్ అవతార్.. స్టంట్స్‌తో అదరగొట్టిన సత్యభామ.. ట్రైలర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu
May 24, 2024 08:22 PM IST

Satyabhama Trailer: కాజల్ యాక్షన్ అవతార్ లో అదరగొట్టేసింది. తనలోని పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ను బయటకు తీసింది. స్టంట్స్ తోనూ ఆకట్టుకున్న సత్యభామ ట్రైలర్ శుక్రవారం (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాజల్ యాక్షన్ అవతార్.. స్టంట్స్‌తో అదరగొట్టిన సత్యభామ.. ట్రైలర్ వచ్చేసింది
కాజల్ యాక్షన్ అవతార్.. స్టంట్స్‌తో అదరగొట్టిన సత్యభామ.. ట్రైలర్ వచ్చేసింది

Satyabhama Trailer: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సత్యభామ ట్రైలర్ వచ్చేసింది. శుక్రవారం (మే 24) మేకర్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ క్వీన్ ఆఫ్ మాసెస్ నటించిన సినిమా ట్రైలర్ లాంచ్ కు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం. ఇక ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉంది.

కాజల్ సత్యభామ ట్రైలర్

కాజల్ నటించిన సత్యభామ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి మొదట మే 31నే వస్తుందని అనౌన్స్ చేసినా.. తర్వాత అదే రోజు మరో నాలుగు సినిమా రిలీజ్ ఉండటంతో జూన్ 7న సోలో రిలీజ్ గా రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. నవీన్ చంద్ర కూడా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు.

సుమన్ చిక్కల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ మొదట్లోనే ఓ ప్రాణాన్ని కాపాడటానికి విఫలమై.. తర్వాత సస్పెన్షన్ కు గురైన సత్యభామను చూపించారు. అయినా ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకులను పట్టుకోవాలన్న కసి మాత్రం ఆమెలో రగులుతూనే ఉంటుంది. అది పీడకలా వెంటాడటం, మరోవైపు బాధితురాలి కుటుంబం నుంచి ఎదురయ్యే ఛీత్కారాలు ఆమెలో కసిని మరింత పెంచుతాయి.

ఆ మర్డర్ కేసును పరిష్కరించే క్రమంలో మరో హత్య కూడా జరుగుతుంది. వీటిని పరిష్కరించడానికి కేవలం మూడు రోజులే సమయం ఇస్తున్నట్లు పైన బాస్ నుంచి ఆదేశాలు వస్తాయి. మరి ఈ కేసును పరిష్కరించడానికి సత్యభామ ఏం చేయబోతోంది అన్నదే ఈ మూవీ స్టోరీ. ట్రైలర్ తోనే స్టోరీపై ఓ క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం మేకర్స్ చేశారు.

కాజల్ స్టంట్స్

సత్యభామలో కాజల్ పోషించిన పాత్ర పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ది కావడంతో దీనికోసం ఆమె బాగానే కష్టపడినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత కూడా ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు పోషించడం అంత సులువు కాదు.

కానీ కాజల్ మాత్రం దీనిని ఓ సవాలుగా తీసుకొని చేసినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ లో ఆమె చేసిన స్టంట్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాను కాజలే ఒంటిచేత్తో నడిపినట్లు ఈ ట్రైలర్ ద్వారానే స్పష్టమవుతోంది.

బాలక‌ృష్ణ కాళ్లు మొక్కిన కాజల్

ఇక ఈ ట్రైలర్ లాంచ్ కోసం బాలకృష్ణ గెస్టుగా వచ్చాడు. అయితే అతడు వచ్చీ రాగానే కాజల్ అతని కాళ్లు మొక్కి స్వాగతం పలకడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కు బాలయ్య ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లో రాగా.. ఇటు కాజల్ కూడా బ్లాక్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించింది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాలా మ్యూజిక్ అందించాడు.

ట్రైలర్ చూస్తే అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వర్కౌటైనట్లు కనిపిస్తోంది. ఈ సత్యభామ మూవీని బాబీ తిక్కా, శ్రీనివాస రావు తక్కలపల్లి నిర్మించారు. శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించాడు.

Whats_app_banner