Jr NTR Kids: అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు.. నటనను వాళ్లపై రుద్దను: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్-jr ntr on his kids says he will not rub anything on them too much of history not good for kids ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Kids: అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు.. నటనను వాళ్లపై రుద్దను: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

Jr NTR Kids: అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు.. నటనను వాళ్లపై రుద్దను: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Oct 07, 2024 08:57 AM IST

Jr NTR Kids: జూనియర్ ఎన్టీఆర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన పిల్లలపై తాను నటనను రుద్దబోనని, వాళ్లకు ఇష్టమైన రంగాల్లో వాళ్లు ఎదిగేలా ప్రోత్సహిస్తానని తారక్ అన్నాడు. నందమూరి చరిత్ర పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా ఈ సందర్భంగా అతడు అనడం గమనార్హం.

అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు.. నటనను వాళ్లపై రుద్దను: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్
అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు.. నటనను వాళ్లపై రుద్దను: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

Jr NTR Kids: నందమూరి వంశం.. తెలుగు రాష్ట్రాలు, ప్రజలపై చెరగని ముద్ర వేసిన చరిత్ర వీళ్లది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు సినిమాలు, రాజకీయాల్లో ఆ వంశం ప్రస్తావన తేకుండా ఉండలేం. అయితే మరీ అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వాళ్లపై బలవంతంగా ఏదీ రుద్దబోనని, వాళ్లకు ఇష్టమైనవే చేసేలా ప్రోత్రహిస్తానని స్పష్టం చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే..

సినిమాలైనా, రాజకీయాలైనా ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఓ భారం ఆ కుటుంబాల నుంచి వచ్చే పిల్లలపై ఉండటం సహజమే. అందుకే స్టార్ కిడ్స్ కు కూడా చిన్నతనం నుంచే అలాంటి ఓ వాతావరణాన్ని అలవాటు చేస్తుంటారు సెలబ్రిటీలు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాను దీనికి పూర్తిగా విరుద్ధమని అంటున్నాడు. తనలాగే తన పిల్లలు కూడా వాళ్లు ఏది కావాలని అనుకుంటున్నారో, ఏ రంగంలోకి వెళ్లాలనుకుంటారో అందులోనే ప్రోత్సహిస్తానని స్పష్టం చేస్తున్నాడు.

నేనో ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా

జూనియర్ ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలాంటి నటులు ఆ వంశంలో ఉన్నారు. కానీ అతన్ని మాత్రం వాళ్లు ఎప్పుడూ యాక్టింగ్ నే కెరీర్ గా తీసుకోవాలని ఒత్తిడి చేయలేదు. బాల నటుడిగా రెండు సినిమాలు చేసి.. తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఒకప్పుడు నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని మీకు తెలుసా?

తాజాగా అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "నేనో నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓ ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్. దేశం మొత్తం తిరిగాను. నాదైన ప్రపంచాన్ని నేను చూశాను. నాకు తప్పులు చేసే అవకాశాన్ని కల్పించారు. వాటిని కుటుంబ మార్గదర్శకంతో సరిదిద్దుకున్నాను" అని ఎన్టీఆర్ చెప్పాడు.

తన పిల్లలు అభయ్, భార్గవ్ లకు తాను ఆదర్శప్రాయంగా నిలవాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. "మరీ అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు. వాళ్లదైన ప్రయాణం సాగించేలా నేనో ఆదర్శప్రాయుడిగా నిలవాలని అనుకుంటున్నాను. జీవితాన్ని అన్వేషించడానికి ఓ అవకాశం వాళ్లకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏదో ఒకటి వాళ్లపై రుద్దడం నాకు ఇష్టం లేదు. వాళ్లకు వాళ్లే నిర్ణయం తీసుకోవాలి" అని ఎన్టీఆర్ అన్నాడు.

తారక్ జర్నీ ఇలా..

జూనియర్ ఎన్టీఆర్ మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర, తర్వాత బాల రామాయణం సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్టూడెంట్ నంబర్ 1తో తొలి హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు.

ఈ మధ్యే వచ్చిన దేవర పార్ట్ 1 మూవీ సక్సెస్ ను జూనియర్ ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అతడు బాలీవుడ్ లో రాబోతున్న వార్ 2, ప్రశాంత్ నీల్ తో మరో మూవీ, దేవర పార్ట్ 2లలో నటించనున్నాడు.

Whats_app_banner