Jr NTR Thalapathy Vijay: దళపతి విజయ్ డ్యాన్స్‌కు నేను వీరాభిమానిని.. డ్యాన్స్ నాకు ఇష్టం ఉండదు: ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్
Jr NTR Thalapathy Vijay: జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దళపతి విజయ్ డ్యాన్స్ కు తాను వీరాభిమానిని అని అతడు అనడం విశేషం. దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో తారక్ ఓ మ్యాగజైన్ తో మాట్లాడాడు.
Jr NTR Thalapathy Vijay: జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లో ఇరగదీస్తాడన్న విషయం తెలుసు కదా. అయితే తనకు మాత్రం డ్యాన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదని అతడు అనడం గమనార్హం. అంతేకాదు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ డ్యాన్స్ కు కూడా తాను పెద్ద అభిమానిని అని తారక్ చెప్పాడు. దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా అతడు చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే.
విజయ్ సర్ డ్యాన్స్ ఇష్టం
టాలీవుడ్ లో ప్రస్తుతం డ్యాన్స్ తో ఇరగదీసే అతికొద్ది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పుడు భారీ పర్సనాలిటీతోనూ అలవోకగా డ్యాన్స్ చేసిన ఘనత అతని సొంతం. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ డ్యాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వికటన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడాడు.
"డ్యాన్స్ డ్యాన్స్ లాగే ఉండాలి. అదేదో ఫైట్ లేదా జిమ్నాస్టిక్స్ లాగా అనిపించకూడదు. దానిని సులువుగా చేసేయాలి. విజయ్ సర్ లాగా. అతడు చాలా కష్టపడుతున్నట్లుగా ఎప్పుడూ అనిపించదు. కూల్ గా ఉంటూనే చాలా అందంగా అతడు డ్యాన్స్ చేస్తాడు. అతని డ్యాన్స్ కు నేను వీరాభిమానిని" అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు.
డ్యాన్స్ అంటే ఇష్టం ఉండదు
తన నటనతోనే కాదు డ్యాన్స్ తోనూ అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు డ్యాన్స్ పెద్దగా ఇష్టం ఉండదంటే నమ్మగలరా? ఈ విషయం తారక్ చెప్పిందే. ఇదే ఇంటర్వ్యూలో అతడు డ్యాన్స్ పై తన అభిప్రాయం కూడా చెప్పాడు.
"డ్యాన్స చేయాలంటే నాకు విసుగు వస్తుంది. కేవలం డైలాగ్, యాక్టింగ్ పార్ట్ సమయంలోనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అదే ఇష్టం. డ్యాన్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు" అని తారక్ స్పష్టం చేశాడు.
ఇక తమిళంలోనూ తాను నేరుగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు ఈ మధ్యే అతడు చెప్పిన విషయం తెలుసు కదా. తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ను తనతో ఓ సినిమా చేయాల్సిందిగా కూడా కోరాడు. ఈ మూవీని తమిళంలోనే తీసి తెలుగులోకి డబ్ చేయాలని అన్నాడు. ఈ విషయాన్ని అతడు తమిళంలో మాట్లాడుతూనే చెప్పడం విశేషం.
దేవర మూవీ ప్రమోషన్లు
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ దేవర ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రమోషన్లు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ముంబై, చెన్నైలలో మొత్తం టీమ్ తో కలిసి వెళ్లి ప్రమోషన్లలో పాల్గొన్నాడు.
కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించిన మూవీ ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.