Devara OTT: ఓటీటీలో దేవర స్ట్రీమింగ్.. సడన్‌గా ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుష్!
Devara Part 1 OTT Netflix: దేవర సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా రూ.500 కోట్ల వరకూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టింది. కానీ.. ఓటీటీలో మాత్రం రిలీజ్ రోజు నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. అయినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్..?
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్, కన్నడతో పాటు మలయాళంలోనూ నవంబరు 8 నుంచి దేవర పార్ట్-1 నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. అయితే.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ గురించి మరో అప్‌డేట్ ఇచ్చింది.
మిక్స్‌డ్ టాక్‌తోనూ భారీగా వసూళ్లు
కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్-1 సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించగా.. శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర పార్ట్ -1 మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నా.. రూ.500 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది.
ఆలస్యంగానే ఓటీటీలోకి దేవర
థియేటర్ల నుంచి వెళ్లిపోయిన చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి దేవర వచ్చింది. కానీ.. ఓటీటీలో కూడా ఈ మూవీపై పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సినిమాలోని లోపాల్ని ఎత్తిచూపుతూ నెటిజన్లు సెటైర్లు వేశారు. అయినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్ హిందీ వెర్షన్‌లోనూ రిలీజ్‌కి సిద్ధమైంది. దేవర పార్ట్ -1 హిందీ వెర్షన్ బుధవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి ఉండనుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అంతేకాదు.. కొరియన్ వెర్షన్ కూడా తీసుకురాబోతోందట. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఖుష్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.
సీక్వెల్ వద్దంటున్న ఫ్యాన్స్
వాస్తవానికి దేవర సీక్వెల్ కూడా ఉండనుందని ఇప్పటికే కొరటాల శివ ప్రకటించారు. అయితే.. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సీక్వెల్ ఆలోచన వద్దని.. దానికి బదులుగా వేరే సినిమా చేయమని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత సినిమాని ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నారు. అలానే బాలీవుడ్‌లోనూ హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 సినిమాలోనూ నటిస్తున్నారు.