Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్-jr ntr is best actor in india says vishwak sen at gangs of godavari teaser release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 27, 2024 07:23 PM IST

Vishwak Sen - Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ రిలీజ్ అయింది. మాస్ యాక్షన్‍తో టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‍లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విశ్వక్‍సేన్.

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్
Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో మాస్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. గతేడాది నుంచి పలుసార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ ఏడాది మే 17వ తేదీన విడుదల కానుంది. ఈ తరుణంలో నేడు (ఏప్రిల్ 27) ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ కోసం ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు హీరో విశ్వక్.

స్టార్ కంటే గొప్ప నటుడు ఆయన..

తన లైఫ్‍లో జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఎంత ఉంది అన్న ప్రశ్నకు విశ్వక్‍సేన్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‍లో స్పందించారు. స్టార్ కంటే జూనియర్ ఎన్టీఆర్ తనకు గొప్ప నటుడు అని విశ్వక్‍సేన్ అన్నారు. ఎన్టీఆర్ అంత గొప్ప నటుడిని కావాలని ఉందని చెప్పారు.

తన దృష్టిలో దేశంలో అందరి కంటే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్ చెప్పారు. “ప్రభావం అంటే.. ఆయన (ఎన్టీఆర్) అంత గొప్ప నటుడిని కావాలని నాకు ఉంటుంది. అందరూ ఆయనను స్టార్ అని అంటారు. నాకు తెలిసి ఇండియాలో అందరి కంటే గొప్ప నటుడు ఆయన. దానికి ఫ్యాన్ నేను. స్టార్ కంటే నాకు ఆయన గొప్ప నటుడు” అని విశ్వక్‍సేన్ అన్నారు. విశ్వక్, ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీని కూడా సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఇద్దరూ కలిసి చూశారు. ఆ మూవీ సక్సెస్ మీట్‍కు కూడా హాజరయ్యారు

ఇది నా డ్రీమ్ రోల్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చేసిన లంక రత్నం తన డ్రీమ్ రోల్ అని విశ్వక్‍సేన్ చెప్పారు. ఫలక్‍నుమా దాస్ చిత్రంతో వచ్చిన ‘మాస్ కా దాస్’ ట్యాగ్‍కు ఈ మూవీ దానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి సీక్వెల్ వస్తుందని నిర్మాత నాగవంశీ చెప్పారు.

టీజర్ ఇలా.. శివాలెత్తిపోద్ది..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ నేడు రిలీజ్ అయింది. ఇంటెన్స్ రస్టిక్ యాక్షన్‍తో ఇది అదిరిపోయింది. గోదావరి జిల్లాలో కొన్ని గ్రూప్‍ల మధ్య జరిగే గొడవల చుట్టూ ఈ మూవీ రూపొందిందని అర్థమవుతోంది. మాస్ గెటప్‍లో విశ్వక్‍సేన్ ఈ టీజర్లో అదిరిపోయారు.. “అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కొక్కడికి శివాలెత్తిద్ది” అని గోదావరి యాసలో విశ్వక్‍సేన్ డైలాగ్ ఆకట్టుకుంది. ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్స్ ఇంటెన్స్‌గా ఉంది.

“నేను మంచోడినో.. చెడ్డోడినో నాకు తెలియదు. కానీ మంచోడన్న చెడ్డ పేరు మాత్రం నాకు వద్దు” అని విశ్వక్ చెప్పిన డైలాగ్ సూపర్‌గా ఉంది. రక్తం కారుతున్న కొడవలి పట్టుకొని విశ్వక్ నడిచే షాట్‍తో ఈ టీజర్ ముగిసింది. మే 17వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విశ్వక్ సరసన నేహా శెట్టి హీరోయిన్‍గా నటించగా.. అంజలి కీలకపాత్ర పోషించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. టీజర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్స్‌గా ఉంది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.