Gangs of Godavari First Song: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి తొలి పాట వచ్చేసింది.. ఆకట్టుకునేలా యువన్ శంకర్ రాజా ట్యూన్-first song suttamla soosi from vishwak sen gangs of godavari released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gangs Of Godavari First Song: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి తొలి పాట వచ్చేసింది.. ఆకట్టుకునేలా యువన్ శంకర్ రాజా ట్యూన్

Gangs of Godavari First Song: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి తొలి పాట వచ్చేసింది.. ఆకట్టుకునేలా యువన్ శంకర్ రాజా ట్యూన్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 16, 2023 05:27 PM IST

Gangs of Godavari First Song: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా నుంచి తొలి పాట రిలీజ్ అయింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Gangs of Godavari First Song: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి తొలి పాట వచ్చేసింది
Gangs of Godavari First Song: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి తొలి పాట వచ్చేసింది

Gangs of Godavari First Song: యంగ్ హీరో, మాస్ కా దాస్ ‘విశ్వక్‍సేన్’ ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చేస్తున్నారు. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ నేడు (ఆగస్టు 16) విడుదలైంది. ‘సుట్టంలా సూసి’ అంటూ మెలోడియస్‍గా ఈ పాట ఉంది.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన ఈ ‘సుట్టంలా సూసి’ పాట మెలోడియస్‍గా ఆకట్టుకునేలా ఉంది. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నేహాశెట్టి మధ్య డ్యుయెట్‍గా ఈ సాంగ్ ఉంది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శ్రీ హర్ష ఇమానీ లిరిక్స్ అందించారు. రూరల్ బ్యాక్‍డ్రాప్‍కు తగ్గట్టు ఈ లవ్ సాంగ్‍కు లిరిక్స్ బాగా సూటయ్యాయి.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా నుంచి ఇటీవలే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మాస్ అవతార్‌లో విశ్వక్‍సేన్ బాగా సూటయ్యారు. గోదావరి జిల్లాలో కొన్ని గ్రూపుల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. “అన్నా.. మేం గోదారోళ్లం.. మాటకొటే సాగదీస్తాం. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం” అంటూ ఫస్ట్ గ్లింప్స్‌లో విశ్వక్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో సాయి కుమార్, గోపరాజు రమణ, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, పార్చ్యున్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీని ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.