Janhvi Kapoor Tamil: జాన్వీ కపూర్ తమిళంలో ఎలా మాట్లాడిందో చూశారా.. అలా చూస్తూ ఉండిపోయిన ఎన్టీఆర్-janhvi kapoor speaks tamil fluently as jr ntr watches fans remembering sridevi devara movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor Tamil: జాన్వీ కపూర్ తమిళంలో ఎలా మాట్లాడిందో చూశారా.. అలా చూస్తూ ఉండిపోయిన ఎన్టీఆర్

Janhvi Kapoor Tamil: జాన్వీ కపూర్ తమిళంలో ఎలా మాట్లాడిందో చూశారా.. అలా చూస్తూ ఉండిపోయిన ఎన్టీఆర్

Hari Prasad S HT Telugu
Sep 18, 2024 11:03 AM IST

Janhvi Kapoor Tamil: జాన్వీ కపూర్ తమిళంలో అనర్గళంగా మాట్లాడటం చూసి జూనియర్ ఎన్టీఆర్ తోపాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో జాన్వీ తమిళంలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

జాన్వీ కపూర్ తమిళంలో ఎలా మాట్లాడిందో చూశారా.. అలా చూస్తూ ఉండిపోయిన ఎన్టీఆర్
జాన్వీ కపూర్ తమిళంలో ఎలా మాట్లాడిందో చూశారా.. అలా చూస్తూ ఉండిపోయిన ఎన్టీఆర్

Janhvi Kapoor Tamil: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తమిళంలో గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది. ఆ సమయంలో స్టేజ్ పైనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమెను అలా చూస్తుండిపోయాడు. పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే కావడంతో ఆమె ఈ భాష ఇలా మాట్లాడుతుందని ఎవరూ ఊహించలేదు. దీంతో తనపై తల్లి శ్రీదేవి ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుందంటూ ఆ దివంగత నటిని ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

తమిళంలో మాట్లాడిన జాన్వీ

జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆమె ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న దేవర తమిళంలోనూ రిలీజ్ కానుండటంతో చెన్నైలో ప్రమోషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగానే జాన్వీ తమిళంలో మాట్లాడి ఆశ్చర్యపరిచింది.

చెన్నై తనకు చాలా ప్రత్యేకం అని, తన తల్లి శ్రీదేవి సొంతూరు కావడం వల్ల ఆమె జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయని ఆమె చెప్పింది. "మీరందరూ మా అమ్మపై కురిపించిన ప్రేమను నాపైనా కురిపిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ వల్ల మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాం. మీ అందరూ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని జాన్వీ చెప్పింది.

అలా చూస్తుండిపోయిన ఎన్టీఆర్

జాన్వీ తమిళంలో మాట్లాడుతుండగా.. ఆమె వెనుకే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చిరునవ్వుతో అలా చూస్తుండిపోయాడు. ఆమె మాట్లాడటం ముగియగానే షో హోస్ట్ వావ్ అనడం కూడా ఆ వీడియోలో చూడొచ్చు. ఈ సందర్భంగా జాన్వీ తన తల్లి శ్రీదేవిని కూడా గుర్తు చేసుకుంది. ఆమెలాగే హార్డ్ వర్క్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

జాన్వీ ఇలా తమిళంలో మాట్లాడటం చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ వీడియోను ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. "ముంబైలో ఉన్నా కూడా దివంగత శ్రీదేవి గారు తన పిల్లలను తమిళంలో మాట్లాడేలా ప్రోత్సహించేది. చెన్నైకి సమ్మర్ వెకేషన్ కు వచ్చినప్పుడు కూడా వాళ్లు తమిళంలో మాట్లాడేవారు. అందుకే జాన్వీకి ఈ భాషపై మంచి పట్టుంది" అని అతడు అన్నాడు. శ్రీదేవి తల్లి రాజేశ్వరిది ఆంధ్రప్రదేశ్ కాగా.. ఆమె తండ్రిది తమిళనాడులోని శివకాశీ.

జాన్వీ దేవర మూవీ..

శ్రీదేవి ఒకప్పుడు టాప్ తెలుగు హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ దేవర మూవీ ద్వారా తొలిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన విషయం తెలిసిందే. జాన్వీని చూడగానే తనకు కూడా శ్రీదేవి గుర్తుకు వచ్చిందని తారక్ కూడా ఈ మధ్యే అన్నాడు.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికా బుకింగ్స్ లో రికార్డులు తిరగరాసిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.