Jr NTR on Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ను చూస్తే శ్రీదేవి గుర్తొచ్చారు: జూనియర్ ఎన్టీఆర్
- Jr NTR on Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ను చూస్తే తనకు అలనాటి తార శ్రీదేవి గుర్తొచ్చారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. దేవర మూవీ ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
- Jr NTR on Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ను చూస్తే తనకు అలనాటి తార శ్రీదేవి గుర్తొచ్చారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. దేవర మూవీ ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
(1 / 5)
అలనాటి హీరోయిన్, దిగ్గజ నటి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్‍లో ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసిన జాన్వీ.. ఇప్పుడు టాలీవుడ్‍లోకి వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‍గా నటించారు. అయితే, జాన్వీని చూస్తే తనకు శ్రీదేవి గుర్తొచ్చారని ఎన్టీఆర్ చెప్పారు.
(2 / 5)
దేవర ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, మూవీ డైరెక్టర్ కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీపై ప్రశంసలు కురిపించారు ఎన్టీఆర్.
(3 / 5)
దేవర కోసం చేసిన ఫొటోషూస్ సమయంలో కొన్ని పోజుల్లో జాన్వీ.. శ్రీదేవిలా కనిపించారని ఎన్టీఆర్ చెప్పారు. “బోట్‍పై కూర్చొని కెమెరావైపు జాన్వీ చూస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీదేవిలా జాన్వీ కనిపించారు” అని అన్నారు.
(4 / 5)
జాన్వీ పర్ఫార్మ్ చేసే విధానం కూడా శ్రీదేవిని గుర్తు చేసిందని ఎన్టీఆర్ అన్నారు. “ఆమె పర్ఫార్మ్ చేసే విధానం, నవ్వే తీరు చూస్తే శ్రీదేవి మళ్లీ గుర్తుకు తెచ్చాయి” అని ఎన్టీఆర్ అన్నారు.
ఇతర గ్యాలరీలు