Janhvi Kapoor: అందాల ఆరబోతలో అడ్డుచెప్పని జాన్వీ కపూర్, దేవరపైనే గంపెడాశలు!
Devara Movie: శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరపై గంపెడాశలు పెట్టుకుంది.
(1 / 7)
బాలీవుడ్‌లో 2018 నుంచి సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌కి ఇప్పటి వరకూ మంచి హిట్ పడలేదు. ఒకవైపు పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా జాన్వీ చేసింది. ఆ సినిమాలకి నటన పరంగా ప్రశంసలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు రాలేదు. దాంతో ఇప్పటికీ జాన్వీ పేరు చెప్పగానే గుర్తొచ్చే కమర్షియల్ సినిమా లేకపోయింది.
(2 / 7)
బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్‌కి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లాయి. కానీ.. ఈ ముద్దుగుమ్మ సౌత్‌లో చేసేందుకు ఇష్టపడలేదు. అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రావడంతో జాన్వీ మనసు మార్చుకుంది. జాన్వీతో పాటు చాలా మంది బాలీవుడ్ నటులు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.
(3 / 7)
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్-1 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆఫర్‌కి ఒప్పుకున్న జాన్వీ కపూర్ ఎట్టకేలకి టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఈ ముద్దుగుమ్మ కనిపించబోతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. దేవర పార్ట్-2 కూడా రానుంది.
(4 / 7)
అందాల ఆరబోతకి ఏమాత్రం అడ్డుచెప్పని జాన్వీ కపూర్.. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
(5 / 7)
జూనియర్ ఎన్టీఆర్‌తో దేవరలో నటిస్తున్న సమయంలోనే రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ఆర్‌సీ16 సినిమాలోనూ జాన్వీ నటించబోతోంది. ఈ మూవీ ముహూర్తం షాట్‍కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. దేవర సినిమా హిట్ అయితే.. జాన్వీకి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
(6 / 7)
సినిమాల్లో జాన్వీ కపూర్‌కి చెప్పుకోదగ్గ హిట్ రాకపోయినా.. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ.. తరచూ ఫొటో షూట్స్, స్టిల్స్‌ను షేర్ చేస్తుంటుంది. జాన్వీని ఇన్‌స్టాలో 25.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.
ఇతర గ్యాలరీలు