Intinti Ramayanam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఇంటింటి రామాయాణం’ సినిమా.. డేట్ ఫిక్స్-intinti ramayanam ott release date this rural movie will premiere on aha ott from june 23 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Intinti Ramayanam Ott Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఇంటింటి రామాయాణం’ సినిమా.. డేట్ ఫిక్స్

Intinti Ramayanam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఇంటింటి రామాయాణం’ సినిమా.. డేట్ ఫిక్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 15, 2023 08:39 PM IST

Intinti Ramayanam OTT Release Date: ఇంటింటి రామాయణం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీ రానుంది. డేట్‍ను కూడా ఆహా ప్రకటించింది.

ఇంటింటి రామాయణం పోస్టర్
ఇంటింటి రామాయణం పోస్టర్

Intinti Ramayanam OTT Release Date: థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోంది ‘ఇంటింటి రామాయణం’ సినిమా. జూన్ 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. రాహుల్ రామకృష్ణ, నరేశ్, నవ్య స్వామి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. సురేశ్ నారెడ్ల కథ, దర్శకత్వం వహించాడు. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఇంటింటి రామాయణం చిత్రం రూపొందింది. ఓ దొంగతనం నేపథ్యంలో కామెడీ ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కింది. కాగా, ఇంటింటి రామాయణం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.

ఇంటింటి రామాయణం చిత్రం జూన్ 23వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా నేడు వెల్లడించింది. “ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఆహాలో ఇంటింటి రామాయణం మీరు చూడకుండా ఉండలేరు. జూన్ 23న ప్రీమియర్ అవుతుంది” అని ఆహా ట్వీట్ చేసింది. ఖతర్నాక్ ఫ్యామిలీ డ్రామ్ అనే ట్యాగ్‍తో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ ఇంటింటి రామాయణం చిత్రం వచ్చింది. జూన్ 23 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.

రాములు ఇంట్లో ఓ బంగారు ఆభరణం చోరీకి గురవడం చుట్టూ ఇంటింటి రామాయణం కథ తిరుగుతుంది. చోరీ తర్వాత రాములు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పరిస్థితులు ఎలా మారాయి, గొడవలు ఎలా జరిగాయన్నది ఈ సినిమా చూపించింది. చాలా సీన్లు సరదాగా సాగిపోతాయి. రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి హీరోహీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, చెవెళ్ల రవి, జీవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి ఈ మూవీని నిర్మించారు.

ముందుగా నేరుగా ఆహాలోనే ఇంటింటికి రామాయణం చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. అయితే, చివర్లో ప్లాన్‍ను మార్చుకొని థియేటర్లలోకి తెచ్చింది. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్‍కు ఖరారైంది.

Whats_app_banner