Indian 2 OTT Rights: అన్ని రికార్డులూ బ్రేక్.. ఇండియన్ 2 మూవీ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం-indian 2 ott rights bagged for whopping 200 crores by netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian 2 Ott Rights: అన్ని రికార్డులూ బ్రేక్.. ఇండియన్ 2 మూవీ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం

Indian 2 OTT Rights: అన్ని రికార్డులూ బ్రేక్.. ఇండియన్ 2 మూవీ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం

Hari Prasad S HT Telugu
Jul 24, 2023 08:33 PM IST

Indian 2 OTT Rights: అన్ని రికార్డులూ బ్రేక్. ఇండియన్ 2 మూవీ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం చెల్లిస్తోంది నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషల హక్కుల డిజిటల్ హక్కులను ఈ ఓటీటీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కమల్ హాసన్
కమల్ హాసన్

Indian 2 OTT Rights: లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో బజ్ క్రియేటైంది. ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమే అయితే.. ఓటీటీ హక్కుల విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ బ్రేక్ అయినట్లే.

ఇండియన్ 2 మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.200 కోట్లకుపైగా చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల హక్కులూ ఈ ఓటీటీకే దక్కినట్లు సమాచారం. అయితే దీనిపై అటు నెట్‌ఫ్లిక్స్ గానీ, ఇటు మేకర్స్ గానీ అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు.

దీంతో ఈ సీక్వెల్ అంతకు మించి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్.. వీఎఫ్ఎక్స్ కోసం అమెరికాలో ఉన్నాడు. అక్కడ లోలా వీఎఫ్ఎక్స్ కంపెనీ ఈ మూవీ గ్రాఫిక్స్ పై పని చేస్తోంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి మూవీకి వీఎఫ్ఎక్స్ అందించిన సంస్థ ఇది. దీంతో ఇండియన్ 2 గ్రాఫిక్స్ ఓ లెవల్లో ఉండబోతున్నాయి.

ఈ టెక్నాలజీ సాయంతో కమల్ హాసన్ యుక్త వయసులో ఎలా ఉన్నాడో అలా మళ్లీ చూపించబోతున్నారు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాలోనే కమల్ హాసన్ మేకప్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్లోనే వయసు మళ్లిన వాడిగా కమల్ ను చూపించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ తోపాటు కాజల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖనిలాంటి వాళ్లు నటిస్తున్నారు.

ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఇండియన్ 2 మూవీని నిర్మిస్తున్నాయి. ఓవైపు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూనే రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే మూవీని కూడా శంకర్ తీస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కమల్ హాసన్ నటిస్తున్న తన 233వ సినిమా హక్కులను కూడా నెట్‌ఫ్లిక్సే రూ.125 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Whats_app_banner