Fighter OTT: ఓటీటీలోకి బ్యాన్ చేసిన మూవీ ఫైటర్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fighter OTT Release Date: గల్ఫ్ కంట్రీస్‌లో బ్యాన్ చేసిన దేశభక్తి మూవీ ఫైటర్ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ ఆసక్తికరంగా మారింది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జోడీగా నటించిన ఫైటర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్, విడుదలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Fighter OTT Streaming Date: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా ఫిట్‌నెస్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్. ఈ సినిమాకు బాలీవుడ్‌లో బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన యంగ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల్లో హృతిక్ రోషన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే.
సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల తర్వాత వస్తున్న మూడో సినిమా ఫైటర్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో పఠాన్‌తో హాట్ హీరోయిన్‌గా మరింత క్రేజ్ తెచ్చుకున్న దీపికా మరో కీలక పాత్ర పోషించడంతో ఇందులో కూడా గ్లామర్ డోస్ బాగానే ఉంటుందని తెలుస్తోంది. అందుకు ఫైటర్ మూవీలోని ఇష్క్ జైసా కుచ్ పాటే ఉదాహరణ. ఈ పాటలో బికినీలో దీపికా పదుకొణె పఠాన్ మూవీలో కంటే రెచ్చిపోయి హాట్ షో చేసింది.
ఫైటర్ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. రిషబ్ సాహ్ని విలన్‌గా చేస్తున్నాడు. అయితే, ఫైటర్ మూవీని 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనుండగా తాజాగా సినిమాకు నిషేధం సెగ అంటుకుంది.
ఫైటర్ మూవీ బ్యాన్ నేపథ్యంలో దాని ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు, డిజిటల్ పార్టనర్ విషయాలు ఆసక్తిగా మారాయి. ఫైటర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అందుకు భారీ ధర చెల్లించిందని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక మల్టీప్లెక్స్ అసోసియేషన్స్ ఆదేశించిన ప్రకారం థియేట్రికల్ విడుదలైన 56 రోజుల తర్వాతే ఫైటర్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఫైటర్ మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకునేటప్పుడే థియేట్రికల్ రిలీజ్ 56 రోజులకు ఓటీటీలో విడుదల చేయాలని సూచించినట్లు సమాచారం. కాబట్టి ఫైటర్ మూవీ మార్చి మూడు లేదా నాలుగో వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ఫైటర్ మేకర్స్ ఏరియల్ ఫ్రాంచైజీని ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో ఫైటర్ మొదటి చిత్రం కాగా తర్వాత మరిన్ని సినిమాలు తీసుకొస్తారని టాక్. ఇదిలా ఉంటే ఫైటర్ మూవీని గల్ఫ్ దేశాలు బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
గల్ఫ్ దేశాల్లోని ఒక యూఏఈ తప్పా మిగతా ఆరు దేశాలు ఫైటర్ మూవీని విడుదల చేయడంపై నిషేధం ప్రకటించాయి. ఒక్క దుబాయ్‌లో మాత్రం పీజీ 15 వర్గీకరణతో ఫైటర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే, ఫైటర్ మూవీ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్ పట్టణ పరిసర ప్రాంతాల్లో భారత సాయుధ దళాలు చేసిన వైమానిక దాడుల నేపథ్యంతో తెరకెక్కించారు. ఇలా తీవ్రవాదం, భారత్, పాక్ వివాదానికి సంబంధించిన సినిమా కావడంతో గల్ఫ్ దేశాలు ఫైటర్‌ను బ్యాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.