Heroine Tax: ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆ ముగ్గురు టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువే..-heroine who paid highest tax in india kareena kapoor khan deepika padukone alia bhatt katrina kaif ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroine Tax: ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆ ముగ్గురు టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువే..

Heroine Tax: ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆ ముగ్గురు టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువే..

Hari Prasad S HT Telugu
Sep 06, 2024 03:34 PM IST

Heroine Tax: ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె కట్టిన ట్యాక్స్ తో పోలిస్తే.. రెండో స్థానంలో ఉన్న వాళ్లు కట్టింది చాలా చాలా తక్కువే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎంత ట్యాక్స్ కట్టిందో చూడండి.

ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆ ముగ్గురు టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువే..
ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆ ముగ్గురు టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువే..

Heroine Tax: సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లు సంపాదించేది చాలా తక్కువే. వాళ్ల రెమ్యునరేషన్లు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే ఓ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం టాప్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తూ 2024లో ఏకంగా రూ.20 కోట్ల ట్యాక్స్ కట్టింది. ఆమె పేరు కరీనా కపూర్. ఫార్చూన్ ఇండియా మ్యాగజైన్ ఈ మధ్యే వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీనా టాప్ లో ఉంది.

కరీనా కపూర్ రూ.20 కోట్ల ట్యాక్స్

ఈ ఏడాది అత్యధిక పన్ను చెల్లించిన ఫిమేల్ సెలబ్రిటీల జాబితాలో కరీనా కపూర్ టాప్ లో నిలిచింది. ఆమె ఏకంగా రూ.20 కోట్ల ట్యాక్స్ కట్టడం విశేషం. ఆమె తర్వాత రెండో స్థానంలో ఉన్న ఫిమేల్ సెలబ్రిటీలు దీపికా పదుకోన్, ఆలియా భట్, అనుష్క శర్మ తలా రూ.12 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. మూడో స్థానంలో రూ.11 కోట్లతో కత్రినా కైఫ్ నిలిచింది.

సినిమా ఇండస్ట్రీలోకి కరీనా వచ్చి రెండు దశాబ్దాలకుపైనే అయింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు. అయితే దీపిక, ఆలియాలాంటి వాళ్లు వచ్చిన తర్వాత కరీనా మెల్లగా సైడైపోయింది. అయితే ఇప్పటికే వీళ్ల కంటే ఎక్కువ పన్ను చెల్లించిన నటి ఆమెనే కావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే.

కరీనా ప్రాజెక్ట్స్

కరీనా కపూర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ బకింగ్‌హామ్ మర్డర్స్ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. ఓ చిన్నారి హత్య కేసును ఛేదించేందుకు ప్రయత్నించే డిటెక్టివ్ జస్మీత్ భామ్రా పాత్రలో కరీనా నటించింది. ఈ సినిమాతో తొలిసారి కరీనా ప్రొడ్యూసర్ గానూ మారడం విశేషం.

ఈ ఏడాది కరీనా ఇప్పటికే క్రూ అనే మూవీతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సింగం అగైన్ సినిమాలోనూ ఆమె నటిస్తోంది. ఈ మూవీ నవంబర్ 1న రిలీజ్ కానుంది.

టాప్ 10 సెలబ్రిటీలు వీళ్లే..

ఆ మ్యాగజైన్ ప్రకారం.. 2024లో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీగా షారుక్ ఖాన్ నిలిచాడు. అతడు ఏకంగా రూ.92 కోట్ల ట్యాక్స్ కట్టడం విశేసం. ఇక ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఉన్నాడు. అతడు ఈ ఏడాది రూ.80 కోట్ల ట్యాక్స్ చెల్లించాడు. మూడో స్థానంలో మరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లతో ఉన్నాడు.

సెలబ్రిటీల్లో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో ఈ ముగ్గురి తర్వాత.. అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లి, అజయ్ దేవగన్, ఎమ్మెస్ ధోనీ, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు.

Whats_app_banner