(1 / 10)
Deepika Baby Bump: చూశారు కదా.. ఒక్క దీపికా పదుకోనే కాదు కరీనా కపూర్, రిహానా, రిచా చద్దాలాంటి వాళ్లు కూడా గతంలో ఇలా తమ బేబీ బంప్స్ తో ఫొటోషూట్స్ చేసి అభిమానులను అలరించారు. సెలబ్రిటీలకు ఇలా బేబీ బంప్స్ చూపించడం ఇప్పుడో అలవాటుగా మారిపోయింది.
(Instagram)(2 / 10)
deepika padukone baby bump photoshoot: మరికొన్ని రోజుల్లో తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికా పదుకోన్ భర్త రణ్‌వీర్ సింగ్ తో కలిసి చేసిన తాజా ఫొటోషూట్ వైరల్ అవుతోంది. సబ్యసాచి డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్ లో ఆమె మెరిసిపోయింది.
(Instagram)(3 / 10)
కరీనా కపూర్ కూడా ఇలాగే ఓ బ్లాక్ అండ్ వైట్ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ చేసింది. తైమూర్ పుట్టడానికి ఓ వారం ముందు ఆమె ఈ ఫొటోషూట్ చేసింది.
(Instagram)(4 / 10)
బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా తన తొలి సంతానానికి వెల్‌కమ్ చెప్పే ముందు ఇలాగే బేబీ బంప్ తో ఫొటోషూట్ చేసింది.
(Instagram)(5 / 10)
అమెరికన్ సింగర్ రిహానా కూడా వోగ్ మ్యాగజైన్ కవర్ షూట్ కోసం తన బేబీ బంప్ తో ఫొటోషూట్ చేసింది. అప్పట్లో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి
(Instagram)(6 / 10)
మరో బాలీవుడ్ నటి రిచా చద్దా కూడా తన భర్త అలీ ఫజల్ తో కలిసి ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ చేసింది.
(Instagram)(7 / 10)
నటి లీసా హేడెన్ ఇలా ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోషూట్ కోసం సముద్రంలో తన బేబీ బంప్ తో ఫొటోలు దిగింది.
(Instagram)(8 / 10)
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించిన నటి సమీరా రెడ్డి తన రెండో సంతానం రాబోయే ముందు నీటి లోపల ఫొటోషూట్ చేసి ఆశ్చర్య పరిచింది.
(Instagram)ఇతర గ్యాలరీలు