Sree Vishnu: మీరు 200 సినిమాలు చేయాలి, అందులో నాకు 15 ఇవ్వాలి.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్
Sree Vishnu Comments In Swag Pre Release Event: హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ స్వాగ్. అక్టోబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (అక్టోబర్ 2) స్వాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Hero Sree Vishnu Swag: టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ స్వాగ్. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గ్రాండ్‌గా స్వాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇప్పటికే విడుదలైన స్వాగ్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ స్వాగ్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా అక్టోబర్ 2న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"అందరికీ వెల్ కమ్. స్వాగ్ సినిమా రాజ రాజ చోర ఎడింగ్‌కి వచ్చినప్పుడు చేద్దామని అనుకున్నాం. హసిత్ ఆరేడు నెలల తర్వాత స్క్రిప్ట్ పూర్తి చేసి చెప్పాడు. కథ విని ఆశ్చర్యపోయా. చాలా పెద్ద కథ. వంశాలు, తరాలకు సంబంధించిన ఇంత పెద్ద కథను చెప్పడం ఈజీ కాదు" అని శ్రీ విష్ణు తెలిపాడు.
కొంచెం భయమేసింది
"అప్పటికి నేను ఏ సినిమాలోనూ డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రలు పోషించాలనగానే కొంచెం భయమేసింది. కానీ, హసిత్‌పై నాకు నమ్మకం ఉంది. తను ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసు. దినికి తోడు డైరెక్షన్ టీం, మా వివేక్ సాగర్, విప్లవ్ వీళ్లంతా యాడ్ అవ్వడంతో ధైర్యం వచ్చింది" అని హీరో శ్రీవిష్ణు అన్నాడు.
"ఎంత మంచి కథైనా తెరకెక్కాలన్నా.. అది ప్రేక్షకుల ముందుకు రావాలన్నా నిర్మాత కావాలి. టీజీ విశ్వ ప్రసాద్ గారు వంద కాదు రెండు వందల సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందులో పది పదిహేను సినిమాలు నాకూ ఇవ్వాలని కోరుకుంటున్నాను (నవ్వుతూ)" అని శ్రీ విష్ణు చెప్పాడు.
పిచ్చెక్కిపోతుంది
"అక్టోబర్ 4న ఈ సినిమా గట్టిగా కొట్టబోతోంది. విశ్వ గారు, వివేక్ గారు ఈ సినిమాకి చేసిన సపోర్ట్ మర్చిపోలేం. మిగతా సినిమాల కంటే ఈ సినిమాకి ఒక మెట్టు ఎక్కువ కష్టపడ్డాం. చాలా ప్రొస్థటిక్ వర్క్స్ ఉన్నాయి. నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చే సినిమా అని టీం అందరికీ చెప్పాను. సినిమా చాలా ప్యాక్డ్‌గా వచ్చింది. ప్యాక్డ్‌గా ఉన్న థియేటర్స్‌లో చూడండి పిచ్చెక్కిపోతుంది. ఇది నా ప్రామిస్" అని శ్రీ విష్ణు పేర్కొన్నాడు.
"తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల మేం గెలుస్తూ ఉంటాం. ఎన్నో విజయాలు అందించారు. ఈసారి మిమ్మల్ని నేను గెలిపించాలనుకుంటున్నా. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు సినిమా నచ్చితే సినిమా పూర్తయిన తర్వాత రెండు చప్పట్లు కొట్టండి. అంతకంటే ఎక్కువ ఆశించడం లేదు. అలాంటి చప్పట్ల నుంచి ఇన్స్‌ఫైర్ అయి ఇక్కడిదాక వచ్చాను" అని హీరో శ్రీ విష్ణు తన స్పీచ్ ముగించాడు.