Adult movie crime: ‘బలవంతంగా అడల్ట్ మూవీలో యాక్ట్ చేయించారు.. ఆత్మాహత్యే శరణ్యం’
Adult movie crime: బలవంతంగా తనను అసభ్యకరమైన అడల్ట్ మూవీలో నటింపజేశారని, ఆ సినిమా విడుదలను అడ్డుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒక నటుడు పోలీసులను ఆశ్రయించాడు. అతడిని బలవంతపెట్టిన దర్శకురాలు ఒక మహిళ కావడం విశేషం.
Adult movie crime: టీవీ సీరియళ్లలో నటించే నటుడికి సినిమా హీరోగా అవకాశం వచ్చింది. దాంతో, సంతోషంగా అగ్రిమెంట్ పై సంతకం చేశాడు. తీరా, షూటింగ్ కు వెళ్తే, అది అసభ్యకర శృంగార దృశ్యాలుండే అడల్ట్ మూవీ అని అర్థమైంది. అగ్రిమెంట్ కారణం చూపి తనతో బలవంతంగా ఆ సినిమాలో యాక్ట్ చేయించారు. ఆ వర్ధమాన నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలివి.
Adult movie crime: అగ్రిమెంట్ చూపి..
కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. వెంగనూరు కు చెందిన 26 ఏళ్ల ఒక వర్ధమాన నటుడు టీవీ సీరియళ్లలో నటిస్తుంటారు. ఒక సినిమాలో హీరో చాన్స్ ఇస్తానంటూ ఒక మహిళా దర్శకురాలు ఆయనను అప్రోచ్ అయ్యారు. అగ్రిమెంట్ చేసుకున్నారు. తీరా షూటింగ్ కు వెళ్లాక అతడికి.. ఆ సినిమా ఒక అడల్ట్ మూవీ అని తెలిసింది. అయితే, సినిమా సిబ్బంది అగ్రిమెంట్ కారణంగా చూపి బలవంతపెట్టి అతడితో షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో ఆ సినిమా ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.
Adult movie crime: ఆత్మ హత్యే శరణ్యం..
తొలి సినిమా కావడంతో, అగ్రిమెంట్ ను సరిగ్గా చదివి, అర్థం చేసుకోలేదని ఆనటుడు వివరించాడు. ఆ సినిమా విడుదలైతే ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు తన ముఖం చూపించలేనని, తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆ నటుడు విజింజమ్ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు ఆ మహిళా దర్శకురాలిపై, ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.