Esha Deol Divorce: మరో బాలీవుడ్ నటి పెళ్లి పెటాకులు.. విడాకులు తీసుకున్న హేమా మాలిని కూతురు-hema malini daughter esha deol divorce bollywood actress mutually parted ways with husband bharat takhtani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Esha Deol Divorce: మరో బాలీవుడ్ నటి పెళ్లి పెటాకులు.. విడాకులు తీసుకున్న హేమా మాలిని కూతురు

Esha Deol Divorce: మరో బాలీవుడ్ నటి పెళ్లి పెటాకులు.. విడాకులు తీసుకున్న హేమా మాలిని కూతురు

Hari Prasad S HT Telugu
Feb 06, 2024 10:10 PM IST

Esha Deol Divorce: బాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్ గా పేరుగాంచిన హేమా మాలిని కూతురు ఈషా డియోల్ పెళ్లి పెటాకులైంది. తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఈ భార్యాభర్తలు మంగళవారం (ఫిబ్రవరి 6) అనౌన్స్ చేశారు.

భర్త భరత్ తో హేమా మాలిని కూతురు ఈషా డియోల్ విడాకులు
భర్త భరత్ తో హేమా మాలిని కూతురు ఈషా డియోల్ విడాకులు

Esha Deol Divorce: బాలీవుడ్ నటి, హేమా మాలిని కూతురు ఈషా డియోల్ విడాకులు తీసుకుంది. 11 ఏళ్లుగా భర్త భరత్ తక్తానీతో కలిసి ఉన్న ఆమె.. తాము విడిపోతున్నట్లు మంగళవారం (ఫిబ్రవరి 6) వెల్లడించింది.

ఈ ఇద్దరూ కలిసి చేసిన అనౌన్స్‌మెంట్ వైరల్ అయింది. 2012లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. వీళ్ల విడాకులకు కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు.

ఈషా డియోల్ విడాకులు

హేమా మాలిని కూతురుగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈషా డియోల్.. 2012లో భరత్ పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు రాధ్యా, మిరాయా కూడా ఉన్నారు. ఇప్పుడు విడాకులు తీసుకున్నా కూడా వాళ్లిద్దరి సంరక్షణను కలిసే చేపట్టనున్నట్లు ఈ జంట వెల్లడించింది. ఈ సమయంలో తమకు ప్రైవసీ కావాలని కూడా వీళ్లు అభిమానులను కోరారు.

"మేమిద్దరం పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వక వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా జీవితాల్లో జరుగుతున్న ఈ మార్పు సమయంలో మా ఇద్దరు పిల్లల సంరక్షణ, వాళ్ల ప్రయోజనాలే మాకు చాలా ముఖ్యం. మా ప్రైవసీని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాం" అని ఈషా, భరత్ ఓ సంయుక్త ప్రకటనలో కోరారు.

ఈ ఇద్దరి విడాకుల విషయమై హిందుస్థాన్ టైమ్స్.. ఈషా డియోల్ తల్లి హేమా మాలినిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె అందుబాటులోకి రాలేదు. ధర్మేంద్ర, హేమా దంపతులకు 1981లో ఈషా జన్మించింది. ఆమెకు అహానా డియోల్ అనే చెల్లెలు కూడా ఉంది.

ఈషా డియోల్ కెరీర్

2002లో కోయి మేరే దిల్ సే పూచే అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఈషా డియోల్ ఎంటరైంది. ఆ సినిమాకుగాను బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత ధూమ్, దస్, నో ఎంట్రీలాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించింది. ధర్మేంద్ర, హేమా మాలిని కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన అందం, అభినయంతో అభిమానులను అలరించింది.

బాలీవుడ్ లో ఆమె సుమారు 30 సినిమాల్లో నటించింది. 2012, జూన్ 29న భరత్ ను ఆమె పెళ్లి చేసుకుంది. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్లో పెద్దగా ఆర్బాటం లేకుండా ఆమె పెళ్లి జరగడం విశేషం. 2017, అక్టోబర్ లో ఈషా తొలిసారి తల్లయింది. 2019, జూన్ 10 రెండో కూతురుకు జన్మనిచ్చింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత భర్తతో విడిపోయింది. అయితే ఈ ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు.

నటిగానే కాదు తల్లి హేమా మాలినిలాగే ఈషా కూడా మంచి ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్. ఈషా, ఆమె చెల్లెలు అహానా డియోల్ ఇద్దరూ ఒడిస్సీ, భరతనాట్యం నేర్చుకున్నారు. ఇక 2020లో ఈషా ఓ బుక్ కూడా రాయడం విశేషం. అమ్మా మియా పేరుతో రిలీజైన ఆ బుక్ లో పేరెంటింగ్ టిప్స్ తోపాటు పిల్లల డైట్ గురించీ ఈషా కొన్ని సలహాలు, సూచనలు పంచుకుంది.