Varalaxmi Sarathkumar: నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. 14ఏళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తితో..
Varalaxmi Sarathkumar Engagement: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చితార్థం ముంబైలో జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక సాగింది. వరలక్ష్మికి కాబోయే భర్త ఎవరంటే..
Varalaxmi Sarathkumar: శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో అరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ నటి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో విలన్‍గా తన ముద్ర వేశారు. క్రాక్ సినిమాలో విలన్‍గా జయమ్మ పాత్రతో తెలుగులో ఫేమస్ అయ్యారు వరలక్ష్మి. ఇటీవల హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో మెప్పించారు. కాగా, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ సిద్దమయ్యారు. ఆమె నిశ్చితార్థం ముంబైలో జరిగింది.
గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. ముంబైలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ఈ వేడుక శుక్రవారం సాగింది. ఈ విషయం నేడు బయటికి వచ్చింది. ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలై సచ్‍దేవ్.. ఆర్ట్ గ్యాలరీను నిర్వహిస్తుంటారు.
వరలక్ష్మి, సచ్‍దేవ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. “ముంబైలో మార్చి 1న జరిగిన వేడుకలో కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్, గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్ ఎంగేజ్‍మెంట్ జరిగింది. గత 14 ఏళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉన్న వరలక్ష్మి, శరత్ రింగులు మార్చుకున్నారు” అని ఓ లెటర్ వెల్లడైంది. ఈ ఏడాదిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.
38 ఏళ్ల వయసులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎట్టకేలకు ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. 14 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న గ్యాలరిస్టు నికోలై సచ్‍దేవ్‍ను వివాహం చేసుకోనున్నారు.
తమిళ హీరో విశాల్‍తో వరలక్ష్మి ప్రేమలో ఉన్నారని చాలా ఏళ్లుగా రూమర్లు ఉన్నాయి. అయితే, ఆమె తండ్రి శరత్ కుమార్, విశాల్ మధ్య మనస్పర్థలు ఉండేవి. దీంతోనే విశాల్, వరలక్ష్మి ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లలేదని రూమర్లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు వరలక్ష్మి పెళ్లిపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. సచిదేవ్‍ను ఆమె వివాహం చేసుకోనున్నారు.
వరలక్ష్మి కెరీర్..
2012లో పొడా పొడి అనే తమిళ చిత్రంతో వరలక్ష్మీ శరత్ కుమార్ తెరంగేట్రం చేశారు. ఎక్కువగా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చిత్రాలు చేశారు. వైవిధ్యమైన నటిగా పేరు తెచ్చుకున్నారు. 2018 వరకు తమిళ, మలయాళం, కన్నడ చిత్రాలు చేశారు వరలక్ష్మి. 2019లో తెనాలి రామకృష్ణ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టారు.
2021లో వచ్చిన క్రాక్ సినిమాతో తెలుగులో ఫుల్ పాపులర్ అయ్యారు వరలక్ష్మి. ఆ సినిమాలో జయమ్మ పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ నెగెటివ్ క్యారెక్టర్లో ఆమె మెప్పించారు. ఆ తర్వాత నాంది సినిమాలో న్యాయవాదిగా నటనతో ఆకట్టుకున్నారు. ఇదే క్రమంలో తమిళం సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలుగులో యశోద, వీరసింహా రెడ్డి, మైకేల్, ఏజెంట్ సహా మరిన్ని చిత్రాల్లో నటించారు.
ఇటీవల పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ అయిన హనుమాన్ చిత్రంలోనూ మెప్పించారు వరలక్ష్మీ శరత్ కుమార్. హీరో హనుమంతు (తేజ సజ్జా) అక్క అంజనమ్మ పాత్రలో ఆమె నటించారు. ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లోనూ వరలక్ష్మి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం దనుష్ హీరోగా నటిస్తున్న రాయన్‍తో పాటు మలయాళం, తెలుగులో చెరో చిత్రం ఆమె చేతిలో ఉన్నాయి. చెన్నై నుంచి ఇటీవలే తన నివాసాన్ని హైదరాబాద్‍కు మార్చుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్.