Guppedantha Manasu Rishi: సినిమాల కోసం పేరు మార్చుకున్న గుప్పెడంత మనసు రిషి - పాన్ ఇండియన్ మూవీతో హీరోగా ఎంట్రీ!
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి ప్రియమైన నాన్నకు పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్నాడు. సినిమా పోస్టర్‌ను ముఖేష్ గౌడ అభిమానులతో పంచుకున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ప్రియమైన నాన్నకు మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ముఖేష్ గౌడ ప్రకటించాడు.
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను ముఖేష్ గౌడ స్వయంగా వెల్లడించాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ మూవీకి తెలుగులో ప్రియమైన నాన్నకు అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు.
కన్నడంలో తీర్థరూప తండేయావరిగే అనే పేరు పెట్టారు. ప్రియమైన నాన్నకు మూవీ పోస్టర్‌ను ముఖేష్ గౌడ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ పోస్టర్‌లో ఎత్తైన కొండలతో కూడిన ప్రాంతంలో ఓ యువకుడు, ఇద్దరు యువతులు కలిసి జర్నీ సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో ముఖేష్‌గౌడతో పాటు మిగిలిన వారి ముఖాలను మాత్రం చూపించలేదు.
గమ్యానికి చేరుస్తుంది...
వేసే ప్రతి తొలి అడుగు మనల్ని గమ్యానికి మరింత దగ్గర చేస్తుందంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ముఖేష్ గౌడ ఓ క్యాప్షన్‌ను జోడించాడు. బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో ప్రతిభావంతులైన నటీనటుల కలయికలో వస్తోన్న ఈ సినిమా ఇదని, ప్రియమైన నాన్నకు మూవీతో తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలుకానున్నట్లు రిషి తెలిపాడు. ప్రియమైన నాన్నకు మూవీకి రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
పేరు మార్చుకున్న రిషి....
సినిమాల కోసం గుప్పెడంత మనసు రిషి తన పేరును మార్చుకున్నాడు. ఈ తెలుగు, కన్నడ బైలింగ్వల్ మూవీ పోస్టర్స్‌పై ముఖేష్ గౌడ పేరు నిహార్ ముఖేష్‌గా కనిపిస్తోంది. ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి...సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్‌గా కొనసాగనున్నట్లు సమాచారం. ప్రియమైన నాన్నకు తన ఫస్ట్ మూవీ అంటూ ముఖేష్ గౌడ పేర్కొన్నాడు.
తెలుగులో గీతా శంకరం…
ఈ బైలింగ్వల్ మూవీ కంటే ముందే తెలుగులో గీతా శంకరం పేరుతో ముఖేష్ గౌడ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. కొంత షూటింగ్ పార్ట్ కూడా పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈసినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ముఖేష్ గౌడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను బట్టి చూస్తుంటే గీతా శంకరం ఆగిపోయినట్లు తెలుస్తోంది.
గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్...
గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి పాత్రతోనే తెలుగు ఆడియెన్స్‌కు చేరువయ్యాడు ముఖేష్ గౌడ. గత నాలుగేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియల్‌కు త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు హఠాత్తుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ ప్రమాదం కారణంగా ఏడెనిమిది నెలల పాటు గుప్పెడంత మనసు సీరియల్‌కు రిషి దూరంగా ఉన్నాడు.
రంగాగా రీ ఎంట్రీ…
ఆ తర్వాత రంగాగా కొత్త పాత్రలో ఎంట్రీ ఇచ్చి గత కొన్ని నెలలుగా మేకర్స్ సీరియల్‌ను రన్ చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో డ్రామా, ఎమోషన్స్ పండకపోవడం, ఒకే పాయింట్ చుట్టూ గత ఏడాదిగా సీరియల్ తిప్పుతూ సాగదీస్తున్నారంటూ ఆడియెన్స్ నుంచి విమర్శలు రావడంతో సీరియల్‌కు శుభం కార్డు వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.