Samantha Naga Chaitanya: నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఆ ఒక్క ఫొటో.. డిలీట్ చేయాలంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్
Samantha Naga Chaitanya: సమంతతో నాగ చైతన్య విడిపోయి మూడేళ్లు అవుతున్నా అతని ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పటికీ ఆమెకు చెందిన ఒక ఫొటో ఉంది. ఇప్పుడా ఫొటోను డిలీట్ చేయాలంటూ ఫ్యాన్స్ అడుగుతుండటం విశేషం.
Samantha Naga Chaitanya: నాగ చైతన్య తన జీవితంలో నుంచి సమంత చాప్టర్ ను పూర్తిగా క్లోజ్ చేసి.. శోభిత ధూళిపాళతో కొత్త ఛాప్టర్ మొదలుపెడుతున్నాడు. గురువారం (ఆగస్ట్ 8) అతని ఎంగేజ్‌మెంట్ సందర్భంగా మరోసారి చై ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్న ఏకైక సమంత ఫొటో తెరపైకి వచ్చింది. ఆ ఫొటోను డిలీట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
చైతన్య ఐజీలో సమంత పిక్ ఇదే
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం గురువారం (ఆగస్ట్ 8) ఉదయం 9:42 గంటలకు జరిగిందని అతని తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే చైతన్య ఐజీలో అన్నీ డిలీట్ చేయగా మిగిలిపోయిన ఏకైక సమంత ఫొటో బయటపడింది. ఈ ఫొటోకు సమంత ఫ్యాన్స్ వరుస కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫొటో వాళ్లిద్దరూ కలిసి నటించిన మజిలీ మూవీలోనిది. ఆ సినిమా పోస్టర్ లో సామ్ వెనుక భాగం కనిపిస్తుండగా.. చైతన్య తలకు హెల్మెట్ తో ఉండటం చూడొచ్చు. ఈ ఫొటోను సమంత ఫ్యాన్స్ వెలికి తీసి ఇది మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు అంటూ చైతన్యను నిలదీస్తున్నారు. 2018లో ఈ ఫొటోను అతడు షేర్ చేస్తూ.. మిసెస్ అండ్ గర్ల్‌ఫ్రెండ్ అనే క్యాప్షన్ ఉంచాడు.
ఎందుకు డిలీట్ చేయలేదు?
ఈ ఫొటోపై ఉదయం నుంచి సమంత ఫ్యాన్స దాడి చేస్తున్నారు. నువ్వు సమంత ఫొటోలు అన్నీ డిలీట్ చేసి ఆమెను అన్‌ఫాలో చేశావు.. ఇదొక్క ఫొటో ఎందుకు డిలీట్ చేయలేదని ఓ అభిమాని ప్రశ్నించారు. ఈ పోస్ట్ డిలీట్ చెయ్యు అని మరో అభిమాని సూచించారు. నీకు సమంత ఫొటోలు పెట్టుకునే అదృష్టం లేదు అని మరో అభిమాని అనడం విశేషం.
అయితే కొందరు ఫ్యాన్స్ చైతన్యకు మద్దతుగా కూడా కామెంట్స్ చేశారు. అది వాళ్ల పర్సనల్ ఇష్యూ అని వదిలేయక మీ పర్సనల్ ఇష్యూలాగా ఎందుకీ కామెంట్స్ అని అన్నారు. 2021లో సమంతతో చైతన్య విడిపోయాడు. తర్వాత ఏడాదికి అంటే 2022లో తొలిసారి శోభితను కలిశాడు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి.
మొత్తానికి రెండేళ్లుగా తన బంధంపై నోరు విప్పని ఈ ఇద్దరూ ఏకంగా నిశ్చితార్థంతోనే ఈ వార్తలకు సమాధానం ఇచ్చారు. ఇక పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి. తెలుగమ్మాయే అయిన శోభిత.. ఇక్కడి కంటే హిందీలోనే ఎక్కువగా నటించి పేరు సంపాదించుకుంది.