Aavesham Twitter Review: మలయాళం నుంచి మరో బ్లాక్‌బస్టర్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం ఫ్యాన్స్ రివ్యూ-fahadh faasil aavesham twitter review fans call this comedy action movie another blockbuster from malayalam cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Twitter Review: మలయాళం నుంచి మరో బ్లాక్‌బస్టర్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం ఫ్యాన్స్ రివ్యూ

Aavesham Twitter Review: మలయాళం నుంచి మరో బ్లాక్‌బస్టర్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం ఫ్యాన్స్ రివ్యూ

Hari Prasad S HT Telugu
Apr 11, 2024 02:52 PM IST

Aavesham Twitter Review: మలయాళం సినిమా నుంచి మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది అంటున్న అక్కడి ఫ్యాన్స్. ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ ట్విటర్ రివ్యూలో మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మలయాళం నుంచి మరో బ్లాక్‌బస్టర్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం ఫ్యాన్స్ రివ్యూ
మలయాళం నుంచి మరో బ్లాక్‌బస్టర్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం ఫ్యాన్స్ రివ్యూ

Aavesham Twitter Review: మలయాళం స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఓ కొత్త అవతారంలో కనిపిస్తున్న మూవీ ఆవేశం. రొమాంచంలాంటి సినిమా అందించిన డైరెక్టర్ జీతూ మాధవన్ నుంచి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గురువారం (ఏప్రిల్ 11) సినిమా రిలీజ్ కాగా.. సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా వాళ్లు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

ఆవేశం మరో బ్లాక్ బస్టర్

పుష్ప 2లోనూ నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు ఆవేశం మూవీలో ఓ కామెడీ, యాక్షన్ కలగలిపిన రంగా అనే పాత్ర పోషించాడు. నిజానికి ఈ సినిమాకు కేరళలో పెద్దగా బజ్ లేదు. అక్కడ కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయినా తొలి షో నుంచే ఈ ఆవేశం సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ నిజమైన పండగలాగే ఉందని కొందరు ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. మంచి యాక్షన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ కలగలసిన సినిమాగా అభివర్ణిస్తున్నారు. ఇందులో బెంగళూరుకు చెందిన ఓ గూండా రంగా పాత్రలో ఫహాద్ నటించాడు. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండాఫే కాస్త నిరాశ పరిచిందని మెజార్టీ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

రంగా పాత్రలో ఫహాద్

అయితే ఆవేశం మూవీలో రంగా పాత్రలో ఫహాద్ ఇరగదీశాడని అంటున్నారు. ఇప్పటి వరకూ అతన్ని ఎన్నడూ చూడని అవతారంలో ఈ మూవీలో చూపించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుందని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని ట్వీట్లు చేశారు. ఈ ఏడాది మలయాళం సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్స్ రాగా.. ఆవేశం కూడా అందులో ఒకటి కాబోతోందని కొందరు అంటున్నారు.

మరోవైపు ఈ ఆవేశం మూవీకి కొన్ని నెగటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఫర్వాలేదనిపించి కామెడీ.. సెకండాఫ్ లో అసలు బాలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. రొమాంచంలాంటి సూపర్ హిట్ హారర్ కామెడీ జానర్ మూవీ అందించిన జీతూ నుంచి తాము కాస్త ఎక్కువే ఆశించామని వాళ్లు ట్వీట్స్ చేశారు.

మలయాళ మూవీ నామ సంవత్సరం

ఈ ఏడాది మలయాళం నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. తొలి మూడు నెలల్లోనే మంజుమ్మల్ బాయ్స్ లాంటి ఆల్ టైమ్ హిట్ తోపాటు ప్రేమలు, అన్వేషిప్పిన్ కండెతుమ్, భ్రమయుగం, ది గోట్ లైఫ్ లాంటి మూవీస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వచ్చిన ఆవేశం ఆ స్థాయిలో కాకపోయినా.. ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

పుష్ప మూవీ కారణంగా తెలుగులోనూ ఫహాద్ కు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అతడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తొలి భాగం చివర్లో కనిపించిన అతడు.. సీక్వెల్ లో మాత్రం పూర్తి స్థాయిలో కనిపించనున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point