Allu Arjun Pushpa 2: పుష్ప 2లో ఆ ఆరు నిమిషాల సీన్ కోసమే రూ.60 కోట్ల ఖర్చు.. 30 రోజుల షూటింగ్-allu arjun pushpa 2 makers spent whopping 60 crores for 6 minute gangamma thalli jatara scene ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Pushpa 2: పుష్ప 2లో ఆ ఆరు నిమిషాల సీన్ కోసమే రూ.60 కోట్ల ఖర్చు.. 30 రోజుల షూటింగ్

Allu Arjun Pushpa 2: పుష్ప 2లో ఆ ఆరు నిమిషాల సీన్ కోసమే రూ.60 కోట్ల ఖర్చు.. 30 రోజుల షూటింగ్

Hari Prasad S HT Telugu
Apr 11, 2024 02:13 PM IST

Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఓ ఆరు నిమిషాల సీన్ కోసం రూ.60 కోట్ల ఖర్చు, 30 రోజుల షూటింగ్ జరిపారట.

పుష్ప 2లో ఆ ఆరు నిమిషాల సీన్ కోసమే రూ.60 కోట్ల ఖర్చు.. 30 రోజుల షూటింగ్
పుష్ప 2లో ఆ ఆరు నిమిషాల సీన్ కోసమే రూ.60 కోట్ల ఖర్చు.. 30 రోజుల షూటింగ్

Pushpa 2 Jatara Scene: అల్లు అర్జున్, రష్మిక మందన్నా ఈ ఏడాది ఆగస్ట్ 15న పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలుసు కదా. ఈ మధ్యే బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ మాతంగి వేషంలో ఓ పట్టు చీర కట్టుకొని చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. ఇది మూవీలోని ఓ జాతర సీన్. దీని కోసమే మేకర్స్ రూ.60 కోట్లు ఖర్చు చేశారట.

ఆరు నిమిషాల జాతర సీన్

తాజాగా న్యూస్ 18లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. పుష్ప 2 మూవీలో గంగమ్మతల్లి జాతర సీన్ ఆరు నిమిషాల పాటు ఉండనుంది. ఇది మొత్తం మూవీకే హైలైట్ గా నిలవనుంది. దీంతో ఈ సీన్ కోసం మేకర్స్ ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు చేయడంతోపాటు ఆ ఆరు నిమిషాల సీన్ కోసమే 30 రోజుల పాటు షూటింగ్ జరిపారట. అందులోని సీనే తాజాగా టీజర్లో రిలీజ్ చేశారు.

గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ లోనూ అల్లు అర్జున్ ఈ లక్ లోనే కనిపించాడు. దానిని బట్టి పుష్ప సీక్వెల్లో ఈ సీన్ కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మేకర్స్ కూడా ఏమాత్రం రాజీ పడకుండా భారీ ఖర్చుతో ఈ సీన్ తీశారు. అయితే ఈ సీన్ కు ఇంత ఖర్చు నిజంగానే పెట్టారా అని హిందుస్థాన్ టైమ్స్ ఆరా తీయడానికి ప్రయత్నించినా.. మూవీ వర్గాలు మాత్రం దీనిని ఖండించలేదు. అలాగని ధృవీకరించలేదు.

"జాతర సీన్ తీయడం కోసం భారీ బడ్జెట్ తో రూపొందించిన సెట్ అవసరమైందన్నది మాత్రం నేను చెప్పగలను. స్టోరీలో కీలకమైన సీన్ కావడంతో మేకర్స్ చాలా శ్రమించారు. అల్లు అర్జున్ తీవ్రమైన వెన్ను నొప్పితోనూ బాధపడినా.. సీన్ పూర్తి చేయగలిగాడు" అని సదరు వర్గాలు వెల్లడించాయి. పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ను డైరెక్టర్ సుకుమార్ మరింత జాగ్రత్తగా చెక్కుతున్నాడు.

పుష్ప 2 టీజర్

ఈ మధ్యే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప: ది రూల్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది ఈ జాతరలో మాతంగి వేషంలో రౌడీలను అల్లు అర్జున్ చితకబాదే సీన్. ఇదొక్క సీన్ తోనే బన్నీ, సుకుమార్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు. గ్లింప్స్ లాగా ఉన్న టీజర్ రిలీజ్ చేశారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఇందులో అల్లు అర్జున్ స్టైల్ కు మాత్రం ఫిదా అయిపోయారు.

ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. పుష్ప 1 ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.30 కోట్లకు దక్కించుకుంది. కానీ ఆ మూవీ హిట్ కావడం, ఇప్పుడు సీక్వెల్ పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో అంతకు మూడింతలు పెరిగిపోయింది. బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరగడం గమనార్హం

పుష్ప 2 మూవీలో ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నటీనటులే కనిపించనున్నారు. అల్లు అర్జున్ తోపాటు రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, బ్రహ్మాజీ, అనసూయ భరద్వాజ్, సునీల్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

IPL_Entry_Point