Pushpa 2: ఇండియాలో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన టీజర్స్ ఇవే - ప్రభాస్ సలార్ ఫస్ట్ - అల్లు అర్జున్ పుష్ప 2 ప్లేస్ ఇదే!
పుష్ప 2 మూవీ టీజర్ అల్లు అర్జున్ బర్త్‌డేను పురస్కరించుకొని సోమవారం రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో పుష్ప 2 టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ ఫైవ్ మూవీ టీజర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో ఉన్న సినిమాలు ఏవంటే?
(1 / 5)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ టీజర్‌కు 83 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వ్యూస్ లభించిన టీజర్‌గా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది.
(2 / 5)
సలార్ తర్వాత అత్యధిక మంచి వీక్షించిన టీజర్స్‌లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్‌కు 69 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఆదిపురుష్‌లో కృతిసనన్ హీరోయిన్‌గా నటించింది.
(3 / 5)
హయ్యెస్ట్ వ్యూస్ లభించిన మూవీ టీజర్స్ లిస్ట్‌లో యశ్ కేజీఎఫ్ 2 మూడో స్థానంలో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ టీజర్‌కు యూట్యూబ్‌లో 68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
(4 / 5)
ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ టీజర్‌ను యూట్యూబ్‌లో 42 మిలియన్ల మంది చూశారు. ఈ లవ్‌స్టోరీ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది.
ఇతర గ్యాలరీలు