Dunki 12 days box office collections: సలార్‌కు చాలా దూరంలో డంకీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. 12 రోజుల్లో ఎంతంటే?-dunki 12 days box office collections close to 200 crores in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dunki 12 Days Box Office Collections: సలార్‌కు చాలా దూరంలో డంకీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. 12 రోజుల్లో ఎంతంటే?

Dunki 12 days box office collections: సలార్‌కు చాలా దూరంలో డంకీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. 12 రోజుల్లో ఎంతంటే?

Hari Prasad S HT Telugu

Dunki 12 days box office collections: బాలీవుడ్‌లో సలార్ కు పోటీగా ఆ సినిమా కంటే ఒక రోజు ముందే రిలీజైన షారుక్ ఖాన్ డంకీ మూవీ.. 12వ రోజు రూ.9.25 కోట్లు వసూలు చేసింది. హిందీలో సలార్ కంటే మంచి కలెక్షన్లు వచ్చినా.. ఓవరాల్‌గా ప్రభాస్ దే పైచేయి అయింది.

ఇండియాలో రూ.200 కోట్లకు చేరువైన డంకీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు

Dunki 12 days box office collections: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ న్యూ ఇయర్ అయిన సోమవారం (జనవరి 1) రోజు రూ.9.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. గతేడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందించిన షారుక్.. హ్యాట్రిక్ సాధిస్తాడనుకుంటే డంకీ మాత్రం నెగటివ్ టాక్ తో ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

ఓవైపు సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్లు.. ఇండియాలో రూ.400 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకెళ్తుండగా.. డంకీ ఇంకా ఇండియాలో రూ.200 కోట్ల మార్క్ కూడా దాటలేదు. సోమవారం 12వ రోజు రూ.9.25 కోట్లతో మొత్తంగా ఇండియాలో రూ.196.97 కోట్లు వసూలు చేసింది. న్యూ ఇయర్ రోజు డంకీ థియేటర్లలో 30.8 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

హిందీ బెల్ట్‌లో ప్రభాస్ సలార్ కంటే డంకీదే పైచేయి అయినా.. సౌత్‌లో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సలార్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. సలార్ పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ కావడం కలిసి వచ్చింది. మరోవైపు డంకీ మాత్రం కేవలం హిందీలోనే రిలీజైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సలార్ కంటే డంకీనే ఎక్కువగా ఆదరించారు.

సలార్ 11 రోజుల్లో హిందీ వెర్షన్ లో రూ.123 కోట్లు వసూలు చేయగా.. డంకీ రూ.196 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. డంకీ రూ.370.25 కోట్లు వసూలు చేయగా.. త్వరలోనే రూ.400 కోట్లు దాటనుంది. గతేడాది పఠాన్, జవాన్ లతో రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందించిన షారుక్ ఖాన్‌కు డంకీ మాత్రం అనుకున్న ఫలితం ఇవ్వలేకపోయింది.

రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. లండన్ వెళ్లాలని కలలు కంటూ వీసాలు రాకపోవడంతో అక్రమంగా ఆ దేశంలోకి వెళ్లి ఇబ్బందులు పడే నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ డంకీ మూవీ. ఇందులో హార్డీ అనే పాత్రలో షారుక్ నటించాడు. తాప్సీ, విక్కీ కౌశల్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.