Prabhas on Salaar success: థ్యాంక్యూ డార్లింగ్స్: సలార్ సక్సెస్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదీ
Prabhas on Salaar success: సలార్ సక్సెస్‌పై థ్యాంక్యూ డార్లింగ్స్ అంటూ ప్రభాస్ తొలిసారి స్పందించాడు. అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ.. తనకు పెద్ద హిట్ అందించిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.
Prabhas on Salaar success: సలార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ సాధించిన తర్వాత తొలిసారి స్పందించాడు రెబల్ స్టార్ ప్రభాస్. సోమవారం (జనవరి 1) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు కృతజ్ఞతలతోపాటు న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పాడు. సలార్ మూవీ 10 రోజుల్లోనే రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.
సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజై హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌కు తొలి హిట్ అందించింది. ఈ మూవీలో దేవ అనే పాత్రలో అతడు కనిపించాడు. చాన్నాళ్ల తర్వాత ప్రభాస్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో సలార్‌కు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
నేను ఖాన్సార్ భవిష్యత్తేంటో తేల్చే లోపు మీరు హాయిగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి డార్లింగ్స్.. సలార్ సీజ్‌ఫైర్‌ను మీ సినిమాగా భావించి పెద్ద సక్సెస్ అందించినందుకు థ్యాంక్యూ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ రాశాడు. దీనికి సలార్ మూవీలోని పోస్టర్‌నే ఫొటోగా పోస్ట్ చేశాడు.
సోమవారం (జనవరి 1) ఉదయం ప్రభాస్ ఈ పోస్ట్ చేయగా.. లక్షల మంది లైక్ చేశారు. వేల మంది హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. సలార్ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డంకీ పోటీని తట్టుకుంటూ 10 రోజుల్లో ఆ మూవీ రూ.500 కోట్ల మార్క్ అందుకుంది.
ఇండియాలోనూ రూ.345 కోట్ల నెట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తెలుగులోనూ సలార్ మూవీ పది రోజుల్లో రూ.198 కోట్లు వసూలు చేసింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాపులతో ఢీలా పడిన ప్రభాస్‌కు సలార్ కొత్త ఊపునిచ్చింది.