Sita Ramam Twitter Review: సీతారామం.. క్లాసిక్‌ రొమాంటిక్‌ బ్లాక్‌బస్టర్‌గా తేల్చిన ట్విటర్‌-dulquer salmans sita ramam twitter review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sita Ramam Twitter Review: సీతారామం.. క్లాసిక్‌ రొమాంటిక్‌ బ్లాక్‌బస్టర్‌గా తేల్చిన ట్విటర్‌

Sita Ramam Twitter Review: సీతారామం.. క్లాసిక్‌ రొమాంటిక్‌ బ్లాక్‌బస్టర్‌గా తేల్చిన ట్విటర్‌

HT Telugu Desk HT Telugu

Sita Ramam: యుద్ధంతో రాసిన ప్రేమకథ సీతా రామం మూవీని రొమాంటిక్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా తేల్చేశారు అభిమాను. శుక్రవారం (ఆగస్ట్‌ 5) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. ట్విటర్‌లో చాలా వరకూ పాజిటివ్‌ రివ్యూలే ఉన్నాయి.

సీతా రామం ట్విటర్ రివ్యూ (Twitter)

లవ్‌స్టోరీలను అందంగా సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేసే హను రాఘవపూడి మరోసారి మ్యాజిక్‌ చేశాడు. ఈసారి యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ సీతా రామంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మలయాళ సూపర్‌స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌, మృనాల్‌ ఠాకూర్‌, రష్మికా మందన్నా నటించిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్ట్‌ 5) ప్రేక్షకుల ముందుకు రాగా.. ఎర్లీ ట్విటర్‌ రివ్యూలు ఈ సినిమాను క్లాసిక్‌ రొమాంటిక్‌ బ్లాక్‌బస్టర్‌గా తేల్చేశాయి.

ఈ అందమైన ప్రేమకథ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నట్లు ట్విటర్‌ రివ్యూల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా చివరి వరకూ మూవీలోని సస్పెన్స్‌ను మెయింటేన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయినట్లు నెటిజన్లు చెబుతున్నారు. స్టోరీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, విజువల్స్‌, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్నీ చాలా బాగున్నాయని ఫ్యాన్స్‌ తమ రివ్యూల్లో స్పష్టం చేశారు.

అయితే కాస్త నెమ్మదిగా సాగే కథనమే ఈ మూవీకి మైనస్‌ అని మరికొందరు చెప్పారు. స్లో రొమాంటిక్‌ మూవీస్‌ని ఎంజాయ్‌ చేసే వాళ్లకు మాత్రం సీతా రామం బాగా నచ్చుతుంది. ఇక లీడ్‌ యాక్టర్స్‌ దుల్కర్‌ సల్మాన్‌, మృనాల్‌ ఠాకూర్‌ మధ్య కెమెస్ట్రీ అదుర్స్‌ అని కూడా మరికొందరు చెప్పారు. ఇదొక అల్ట్రా క్లాసిక్‌ మూవీ.. గొప్ప ట్విస్ట్‌లతో గూస్‌బంప్స్‌ తెప్పిస్తుందని ఒక యూజర్‌ ట్విటర్‌లో రాశారు.

ఇదే తన చివరి లవ్‌స్టోరీ అని మూవీ రిలీజ్‌కు ముందు దుల్కర్‌ సల్మాన్‌ చెప్పిన విషయం తెలుసు కదా. అయితే అలా దయచేసి చేయొద్దని, సీతారామంలో నీ నటనతో అదరగొట్టావని మరొక యూజర్‌ చెప్పడం విశేషం. విజువల్‌ ట్రీట్‌ అంటూ ఇంకో యూజర్‌ ఒక్క ముక్కలో సినిమా రివ్యూ చెప్పేశారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.