Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది? కొన్నాళ్లుగా ఎందుకు నిద్రపోవడం లేదు? ఫ్యాన్స్ ఆందోళన-dulquer salmaan said he did not sleep in a while ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది? కొన్నాళ్లుగా ఎందుకు నిద్రపోవడం లేదు? ఫ్యాన్స్ ఆందోళన

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది? కొన్నాళ్లుగా ఎందుకు నిద్రపోవడం లేదు? ఫ్యాన్స్ ఆందోళన

Hari Prasad S HT Telugu
Jul 03, 2023 04:26 PM IST

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది? కొన్నాళ్లుగా ఎందుకు నిద్రపోవడం లేదు? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసి డిలీట్ చేయడం గమనార్హం.

దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా? అతడు కొన్నాళ్లుగా ఎందుకు నిద్రపోవడం లేదు? ఇన్‌స్టాగ్రామ్ లో ఆ వీడియో పోస్ట్ చేసి తర్వాత ఎందుకు డిలీట్ చేశాడు? ఇప్పుడీ ప్రశ్నలే అతడి అభిమానులను వేధిస్తున్నాయి. ఆ వీడియోను దుల్కర్ డిలీట్ చేసినా.. అప్పటికే కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు.

ఆ వీడియోలో ఏముంది?

దుల్కర్ పోస్ట్ చేసిన ఆ వీడియోలో అతడు చాలా బలహీనంగా కనిపించాడు. నిజంగా చాన్నాళ్ల నుంచి నిద్రపోలేదేమో అన్నట్లుగానే ఉన్నాడు. అందులో అతడు మాట్లాడుతూ.. "నేను కొన్నాళ్లుగా నిద్ర పోలేదు. నాకు ఓ విషయం కొత్తగా అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మునుపటిలా లేవు. దానిని మరచిపోలేని స్థితికి చేరుకున్నాను. నేను చాలా చెప్పాలని అనుకుంటున్నాను. కానీ చెప్పలేనేమో" అని దుల్కర్ అనడం విశేషం.

ఈ పోస్ట్ చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దుల్కర్ సల్మాన్ కు ఏమైంది? ఈ పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేశాడు. అంతా బాగానే ఉందా? అంటూ ఓ అభిమాని ఆ వీడియోను పోస్ట్ చేశాడు. తన నెక్ట్స్ మూవీ ప్రమోషన్ కోసం అతనిలా చేశాడేమో అని మరో అభిమాని కామెంట్ చేయడం విశేషం.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోటా అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఈ మధ్యే రిలీజైంది. ఈ మూవీని అభిలాష్ జోషీ డైరెక్ట్ చేశాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, షాహుల్ హసన్, గోకుల్ సురేశ్ నటించారు. ఈ మూవీ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం