Double Ismart Collections: రవితేజను బీట్ చేసిన రామ్ పోతినేని - ఫస్ట్ డే డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్ ఎంతంటే?
Ravi Teja vs Ram: టాలీవుడ్ బాక్సాఫీస్ ఫైట్‌లో ఫస్ట్ డే రవితేజ మిస్టర్ బచ్చన్‌పై రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ పైచేయిని సాధించింది. తొలిరోజు రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ ఏడున్నర కోట్ల కలెక్షన్స్ సాధించింది. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ 5.30 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
Ravi Teja vs Ram: గురువారం రిలీజైన తెలుగు సినిమాల్లో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ఇండిపెండెన్స్ డే కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ నిలిచాయి. వీటితో పాటు నార్నే నితిన్ ఆయ్‌తో పాటు విక్రమ్ తంగలాన్ తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
ఈ నాలుగు సినిమాల్లో తొలిరోజు డబుల్ ఇస్మార్ట్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. గురువారం నాడు వరల్డ్ వైడ్‌గా ఈ మాస్ యాక్షన్ మూవీ ఏడున్నర కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీకి 5.30 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఎంతంటే?
డబుల్ ఇస్మార్ట్‌తో పాటు మిస్టర్ బచ్చన్ సినిమాలకు ఫస్ట్ డే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రెండు సినిమాల కథ, కథనాలతో పాటు దర్శకుల టేకింగ్‌పై విమర్శలొచ్చాయి. ఈ నెగెటివ్ టాక్ వల్లే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వసూళ్లను రాబట్టాయి.
ఏపీ నైజాంలో కలిసి ఫస్ట్ డే డబుల్ ఇస్మార్ట్ మూవీ 5.20 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. రవితేజ మిస్టర్ బచ్చన్ తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 4.5 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. నైజాం ఏరియాలో డబుల్ ఇస్మార్ట్ దాదాపు రెండున్నర కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు చెబుతోన్నారు...
అంచనాలను అందుకోలేక...
డబుల్ ఇస్మార్ట్‌తో పాటు మిస్టర్ బచ్చన్ తొలిరోజు పది కోట్లకుపైనే ఓపెనింగ్స్‌ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఈ రెండు సినిమాలు అంచనాలను అందుకోలేక డిసపాయింట్ చేశారు. రెండో రోజు వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్...
ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. దాదాపు 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. ఫస్ట్ డే కేవలం ఏడున్నర కోట్లు కలెక్షన్స్ మాత్రమే రావడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మాస్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటించాడు. కావ్య థాపర్ హీరోయిన్‌గా కనిపించింది. రివేంజ్ డ్రామాకు మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే పాయింట్‌ను జోడిస్తూ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ కథ రాసుకున్నాడు. మాస్ పాత్రలో రామ్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
రైడ్ రీమేక్...
మరోవైపు బాలీవుడ్ మూవీ రైడ్ రీమేక్‌గా మిస్టర్ బచ్చన్ మూవీని రూపొందించాడు హరీష్ శంకర్. దాదాపు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. సిన్సియర్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్ కథతో రైడ్ మూవీ తెరకెక్కింది.