Crew OTT: ముగ్గురు హీరోయిన్ల సూపర్ హిట్ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే!-crew movie ott tabu kareena kapoor kriti sanon heist comedy movie to stream on netflix platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crew Ott: ముగ్గురు హీరోయిన్ల సూపర్ హిట్ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే!

Crew OTT: ముగ్గురు హీరోయిన్ల సూపర్ హిట్ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 07, 2024 10:26 PM IST

Crew Movie OTT Platform: క్రూ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. ముగ్గురు హీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే..

Crew OTT: ముగ్గురు హీరోయిన్ల సూపర్ హిట్ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే!
Crew OTT: ముగ్గురు హీరోయిన్ల సూపర్ హిట్ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే!

Crew Film OTT: హీరోయిన్లు టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘క్రూ’ సినిమా మార్చి 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. హీస్ట్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రాజేశ్ ఏ కృష్ణన్. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న క్రూ సినిమా వసూళ్లలో జోరు చూపిస్తోంది. స్టడీగా వసూళ్లను రాబడుతోంది. కాగా, క్రూ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్ ఏదో.. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉందో సమాచారం వెల్లడైంది. ఆ వివరాలివే..

ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో..

క్రూ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయ్యాక 8 వారాలకు తమ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ చేసేలా నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుంది.

క్రూ సినిమా మే నెల నాలుగో వారంలో స్ట్రీమింగ్‍కు రానున్నట్టు అంచనాలు ఉన్నాయి. మే 24వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందని బజ్ నడుస్తోంది.

క్రూ మూవీ గురించి..

క్రూ చిత్రంలో టబు, కరీనా కపూర్, కృతి సనన్ ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించారు. ఈ మూవీలో దిల్జీత్, కపిల్ శర్మ, రాజేశ్ శర్మ, స్వస్థ ఛటర్జీ, కుల్‍భూషణ్ కర్బంద కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించగా.. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్స్ నెట్‍వర్క్ బ్యానర్లపై ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ సంయుక్తంగా నిర్మించారు.

రూ.100 కోట్లు దాటిన వసూళ్లు

క్రూ సినిమా రూ.100 కోట్ల క్లబ్‍లోకి వచ్చేసింది. తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం మైల్‍స్టోన్ దాటేసింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.104.08 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇంకా ఈ మూవీకి జోరుగా వసూళ్లు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్‍గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దగా పోటీ లేకపోవటంతో ఈ చిత్రానికి వసూళ్లు ఇంకా బాగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్రూ మూవీ బ్యాక్‍డ్రాప్ ఇదే..

ముగ్గురు ఎయిర్ హోస్టెస్ జీతాలు రాకపోవడంతో అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడడం చుట్టూ క్రూ సినిమా స్టోరీ తిరుగుతుంది. గీతా సేథి (టబు), జాస్మీన్ కోహ్లీ (కరీనా కపూర్), దివ్యా రానా (కృతి సనన్).. కోహినూర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‍గా పని చేస్తుంటారు. అయితే, ఆ ఎయిర్‌లైన్స్‌ కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించదు. కంపెనీలో పరిస్థితులు బాగున్నాయని, త్వరలోనే వేతనాలు చెలిస్తామని అధికారి (రాజేశ్ శర్మ) చెబుతుంటారు. అయితే, కోహినూర్ ఎయిర్‌లైన్స్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని గీత, జాస్మీన్, దివ్యకు అర్థమవుతుంది. అయితే, వారికి డబ్బు చాలా అవసరం ఉంటుంది. ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు అక్రమ మార్గంలో సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? వారు డబ్బు సంపాదించారా.. పట్టుబడ్డారా? అనేదే క్రూ సినిమా స్టోరీగా ఉంది.

IPL_Entry_Point