chiyaan vikram: రజనీకాంత్ డైరెక్టర్‌తో విక్రమ్ పీరియాడికల్ సినిమా షురూ..
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి, కాలా చిత్రాలతో కోలీవుడ్‌లో మంచి పేరుతెచ్చుకున్నారు దర్శకుడు పా రంజిత్ (pa ranjith). తాజాగా ఆయన హీరో విక్రమ్ (chiyaan vikram) తో ఓ సినిమా చేయబోతున్నారు. శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది.
కోలీవుడ్ లో దర్శకుడు పా రంజిత్‌ది ప్రత్యేకమైన శైలిగా చెప్పవచ్చు అణగారిన వర్గాలు ఎదుర్కొనే సమస్యలను చర్చిస్తూ సినిమాల్ని తెరకెక్కిస్తుంటాడతడు. మద్రాస్ సినిమాతో దర్శకుడిగా వెలుగులోకి వచ్చిన పా రంజిత్ ఆ తర్వాత రజనీకాంత్ తో వరుసగా కబాలి,కాలా సినిమాలు చేశాడు. రజనీ ఇమేజ్ కు భిన్నమైన కథాంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాలు కమర్షియల్ సక్సెస్‌గా నిలిచాయి. తాజాగా అతడు కోలీవుడ్ అగ్ర హీరో విక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు.
శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా మొదలైంది. ఈ పూజా కార్యక్రమాల్లో హీరో విక్రమ్ కూడా పాల్గొన్నారు. 1800 కాలం నాటి కథాంశంతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను త్రీడీ లో రూపొందించనున్నట్లు చెబుతున్నారు. ఇందులో పవర్ ఫుల్ పాత్రలో విక్రమ్ కనిపించనున్నట్లు తెలిసింది. తమిళంతో పాటు తెలుగు,హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమా ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం పొన్నియన్ సెల్వన్ లో విక్రమ్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ రిలీజ్ కానుంది. ఇటీవల విక్రమ్ అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్ లో చేరారు. అతడికి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ పుకార్లను విక్రమ్ ఖండించాడు.