Chiranjeevi - Ram Charan: చిరంజీవి మెగా సినీ జర్నీకి 45ఏళ్లు.. రామ్‍చరణ్ భావోద్వేగమైన ట్వీట్-chiranjeevi cinema journey turns 45 years ram charan pens emotional note ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Chiranjeevi Cinema Journey Turns 45 Years Ram Charan Pens Emotional Note

Chiranjeevi - Ram Charan: చిరంజీవి మెగా సినీ జర్నీకి 45ఏళ్లు.. రామ్‍చరణ్ భావోద్వేగమైన ట్వీట్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 22, 2023 07:03 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రస్థానం 45 సంవత్సరాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తనయుడు రామ్‍చరణ్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Chiranjeevi - Ram Charan: చిరంజీవి మెగా సినీ జర్నీకి 45ఏళ్లు.. రామ్‍చరణ్ భావోద్వేగమైన ట్వీట్
Chiranjeevi - Ram Charan: చిరంజీవి మెగా సినీ జర్నీకి 45ఏళ్లు.. రామ్‍చరణ్ భావోద్వేగమైన ట్వీట్

Chiranjeevi: నట శిఖరం మెగాస్టార్ కొణిదెల చిరంజీవి సినిమా ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. తన అద్భుత సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‍బాస్టర్లు, ఇండస్ట్రీ హిట్‍లు, రికార్డులు సృష్టించారు చిరంజీవి. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అలాగే, సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు చిరంజీవి. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 155 చిత్రాలు చేశారు చిరంజీవి. ఇప్పుడు 68 సంవత్సరాల వయసులోనూ వరుస సినిమాలతో ఫుల్ జోష్‍లో ఉన్నారు చిరూ. ఈ ఏడాది కూడా 2 సినిమాలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి నట ప్రస్థానానికి 45 సంవత్సరాలు నిండాయి. చిరంజీవి నటించిన తొలి సినిమా 'ప్రాణం ఖరీదు'.. 1978 సెప్టెంబర్ 22న రిలీజ్ అయింది. ఆ చిత్రం విడుదలై నేటితో (2023 సెప్టెంబర్ 22) 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి సినీ జర్నీపై ఆయన తనయుడు రామ్‍చరణ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

45 సంవత్సరాల అద్భుతమైన సినిమా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తండ్రి మెగాస్టార్ చిరంజీవికి అభినందలు తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్. ఈ మేరకు నేడు ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తమలో అద్భుతమైన విలువలను నింపిన ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. కోట్లాది మందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉన్నారని రామ్‍చరణ్ పోస్ట్ చేశారు.

“సినిమాల్లో 45 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన ప్రయాణం!. ప్రాణంఖరీదుతో మొదలుపెట్టి.. ఇంకా మీ అద్భుతమైన పర్ఫార్మెన్సులు కొనసాగుతున్నాయి. తెరపై నటనతో.. బయట మానవతా కార్యక్రమాలతో.. రెండింటితోనూ కోట్లాది మందికి మీరు స్ఫూర్తిగా ఉంటున్నారు. మాలో క్రమశిక్షణ, కష్టపడేతత్వం, అకింతభావం, సమర్థత.. అన్నింటికన్నా దయాగుణం లాంటి విలువలను నింపిన మీకు ధన్యవాదాలు” అని రామ్‍చరణ్ ట్వీట్ చేశారు. చిరంజీవి నటించిన వివిధ పాత్రలకు సంబంధించిన ఫొటోలతో కూడిన పోస్టర్‌ను కూడా చరణ్ పోస్ట్ చేశారు.

చిరంజీవి సినీ ప్రస్థానానికి 45 సంవత్సరాలు నిండటంతో చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య బంపర్ హిట్ అయింది. 68 ఏళ్ల వయసులోనూ చిరంజీవి గ్రేస్, గ్లామర్, జోష్ ఏ మాత్రం తగ్గలేదు. తన తదుపరి రెండు చిత్రాలకు కూడా చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. 157వ చిత్రంగా సోషియో ఫ్యాంటసీ మూవీ చేయనున్నారు చిరంజీవి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.